Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సంజయ్ లీలా భన్సాలీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పద్మావతి చిత్రంలోని ఘూమర్ పాటను ఇటీవలే విడుదల చేశారు. పద్మావతికే తలమానికంగా భావిస్తున్న ఈ సాంగ్ ఒక్కరోజులోనే మిలియన్ కు పైగా వ్యూస్ సాధించి టాప్ ట్రెండ్ గా నిలిచింది. అనేకమంది డాన్సర్లు ఉన్నప్పటికీ ఈ పాటలో ప్రధానంగా కనిపించింది పద్మిణిగా నటిస్తున్న దీపికా పడుకునే, రతన్ సింగ్ పాత్ర పోషిస్తున్న షాహిద్ కపూర్. చిత్తోర్ కోట పై భాగాన షాహిద్ కపూర్ నిల్చుని ఉండగా దీపిక పదే పదే పైకి చూస్తూ…షూమర్ నృత్యం చేస్తుంటుంది. అయితే దీపిక చేస్తున్న ఘూమర్ నృత్యాన్ని షాహిద్ తో పాటు మరో మహిళ మహారాణి హోదాలో తీక్షణంగా చూస్తున్నట్టు పాటలో మూడుసార్లు కనిపించింది.
దీంతో ఆ క్యారెక్టర్ ఎవరూ అంటూ సోషల్ మీడియాలో చర్చ ప్రారంభమయింది. ఇది ఎక్కడిదాకా వెళ్లిందంటే..నెట్ లో మిస్టరీ మహారాణి అంటూ ట్రెండింగ్ గా మారింది. ఇంతకీ ఆ మిస్టరీ మహారాణి ఎవరో తెలుసా..? మంచు మనోజ్ పోటుగాడు హీరోయిన్లలో ఒకరైన అనుప్రియ గోయెంకా….పద్మావతి లో రతన్ సింగ్ మొదటి భార్య మహారాణి నాగ్ మతి గా అనుప్రియ నటిస్తోందని చిత్ర యూనిట్ తెలిపింది. సినిమాలో అనుప్రియ క్యారెక్టర్ కు కూడా చాలా ప్రాధాన్యమున్నట్టు తెలుస్తోంది. అనుప్రియ తెలుగులో పోటుగాడుతో పాటు పాఠశాల సినిమాలో నటించింది. పద్మావతి అనుప్రియకు బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చిపెడుతుందని భావిస్తున్నారు.