అనుష్క ఈ డేట్‌కు వచ్చేది కన్ఫర్మేనా?

anushka bhagmatie movie release on Republic day

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

‘బాహుబలి’ చిత్రం తర్వాత అనుష్క చేస్తున్న చిత్రం ‘భాగమతి’. భారీ అంచనాల నడుమ పిల్ల జమీందార్‌ ఫేం అశోక్‌ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో వంశీ మరియు ప్రమోద్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు సంవత్సర కాలంగా ఈసినిమా గురించి మీడియాలో ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఎట్టకేలకు సినిమాకు సంబంధించిన అధికారిక సమాచారంను చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించడం జరిగింది. మొన్నటి వరకు ఇదొక ఛారిత్రాత్మక నేపథ్యం సినిమా అని అంతా భావించారు. కాని ఇదో రెగ్యులర్‌ సోషల్‌ ఫిల్మ్‌ అని, అనుష్క కలెక్టర్‌గా కనిపించబోతుందని చిత్ర యూనిట్‌ సభ్యులు క్లారిటీ ఇచ్చారు.

anushka

ఇటీవలే సంక్రాంతికి సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. పవన్‌ మరియు బాలయ్యలకు పోటీగా అనుష్క చిత్రం విడుదల కాబోతుందని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే సంక్రాంతికి కాకుండా కాస్త ఆలస్యంగా గణతంత్ర దినోత్సవం సందర్బంగా సినిమాను విడుదల చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే అధికారికంగా మీడియా నోట్‌ను కూడా విడుదల చేశారు. సినిమా షూటింగ్‌ దాదాపుగా పూర్తి అయ్యిందని, పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ ఎక్కువగా ఉందని, అందుకే విడుదల కాస్త ఆలస్యం అవుతుందని దర్శకుడు అశోక్‌ చెబుతున్నారు. భారీ అంచనాలున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందని ప్రేక్షకులు మరియు సినీ వర్గాల వారు ఎదురు చూస్తున్నారు.