తీవ్ర విషాదంలో అనుష్క ఫ్యామిలీ.. డాన్ మృతి

anushka-senastinal-comments

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. మాజీ అండర్ వరల్డ్ డాన్, సామాజిక ఉద్యమకారుడు ముతప్ప రాయ్ మృత్యువాత పడ్డారు. టాలీవుడ్ టాప్ స్టార్ అనుష్క కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా పేరుమోసిన మాజీ అండర్ వరల్డ్ డాన్ వయసు 68 సంవత్సరాలు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బ్రెయిన్ క్యాన్సర్‌ కు చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారు జామున రెండు గంటల సమయంలో ఆయన ప్రాణాలు విడిచారు.

అయితే బ్రెయిన్ క్యాన్సర్ కారణంగా తాను ఐదేళ్లకు మించి బ్రతకనని తాజాగా ఆయనే స్వయంగా తెలిపిన విషయం తెలిసిందే. ఒక సాధారణ బ్యాంకు ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన అండర్ వరల్డ్ డాన్‌ వరకు ఎదిగారు. 30 ఏళ్ల పాటు బెంగళూరు అండర్ వరల్డ్ సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్నాడు ముతప్ప రాయ్. ఆ తర్వాత 2000వ సంవత్సరంలో దుబాయ్ లో తలదాచుకున్న రాయ్‌ను భారత్‌కు అప్పగించింది ఆ ప్రభుత్వం. ఇక అప్పటినుంచి ఈ వ్యవహారాలకి దూరంగా ఉంటూ వచ్చారు. ఆ తర్వాత కర్ణాటక అనే ఆర్గనైజేషన్‌ను ఏర్పాటు చేసి దాని ద్వారా చాలామంది పేద ప్రజలకు సహాయం చేశారు.

అయితే వీరు అనుష్క శెట్టి ఫ్యామిలీకి చాలా సమీప బంధువు. బాహుబాలి రిలీజ్ తర్వాత అనుష్క దేశ వ్యాప్తంగా ఆలయాల సందర్శనకు వెళ్లారు. ఆ సమయంలో ఈయన కూడా అనుష్క వెంట ఉన్నారు. అంతేకాకుండా ఈయన జీవితాన్ని ఆధారంగా చేసుకొని రామ్ గోపాల్ వర్మ రాయ్ ఓ సినిమా కూడా ప్రకటించారు. రక్త చరిత్ర సిరీస్ తీసిన వెంటనే వివేక్ ఒబెరాయ్ హీరోగా ఈ సినిమా అనౌన్స్ చేసిన వర్మ ఎందుకో అలా పెండింగ్ లో పెట్టేశారు. వర్మ ఇప్పుడు ఆ సినిమాపై దృష్టి సారిస్తాడేమో చూడాలి.