సమంత హిట్‌ మూవీ సీక్వెల్‌లో అనుష్క…?

Anushka In Sequel Of Ye Maya Chesave

తెలుగు ప్రేక్షకులకు సమంత ‘ఏమాయ చేశావే’ చిత్రంతో పరిచయం అయిన విషయం తెల్సిందే. ఆ చిత్రం సూపర్‌ హిట్‌ అవ్వడంతో సమంత మరియు నాగచైతన్యలు స్టార్స్‌ అయ్యారు.  గత కొన్ని రోజులుగా అనుష్కతో గౌతమ్‌ మీనన్‌ ఒక చిత్రాన్ని చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రం యూత్‌ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా ఒక చిత్రాన్ని తెరకెక్కించేందుకు దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ ప్లాన్‌ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.వార్తలు నిజమే అంటూ తమిళ మీడియాతో గౌతమ్‌ మీనన్‌ చెప్పుకొచ్చాడు. ఈ చిత్రంలో అనుష్కతో పాటు శింభు కూడా నటించబోతున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చాడు. ఇక ఈ చిత్రంతో ఏమాయ చేశావే చిత్రానికి సంబంధం ఉంటుదని చెప్పుకొచ్చాడు.

Anushka In Sequel Of Ye Maya Chesave

‘ఏమాయ చేశావే’ చిత్రం స్టోరీని పొడగించి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ అధికారికంగా ఈ చిత్రం సీక్వెల్‌ అంటూ చెప్పడం లేదు కాని, ఆ కథకు కొనసాగింపుగా లేదా ఆ కథను ఇన్సిఫిరేషన్‌గా తీసుకుని ఈ చిత్రంకు కథను సిద్దం చేసుకుని ఉంటాడు అంటూ సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ సినిమాను మరో నెల రోజుల్లో చిత్రీకరణ ప్రారంభించేందుకు సిద్దం అవుతున్నారు. అనుష్క ప్రధాన పాత్రలో కనిపించే ఈ చిత్రంపై భారీ ఎత్తున అంచనాలున్నాయి. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని దర్శకుడు భావిస్తున్నాడు.