Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రాజెక్టు వద్ద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అధికారులు వాగ్వాదానికి దిగారు. కుడికాల్వకు నీటి విడుదలను తెలంగాణ అధికారులు నిలిపివేయడంతో గొడవ మొదలయింది. కృష్ణా బోర్డ్ ఆంధ్రప్రదేశ్ కు 10.5 టీఎంసీల నీటిని కేటాయించింది. అయితే ఇప్పటివరకూ 10.2 టీఎంసీల నీటిని కుడికాల్వ ద్వారా విడుదల చేశారు. ఇంకా 0.3 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉంది. ఆ నీటిని విడుదల చేయకుండా తెలంగాణ అధికారులు అడ్డుకున్నారంటూ ఆంధ్ర అధికారులు అభ్యంతరం తెలిపారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ముందు జాగ్రత్త చర్యగా డ్యామ్ వద్ద ఇరురాష్ట్రాల పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. రెండు రాష్ట్రాల అధికారుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి.