బ్రిటానియా ఇండస్ట్రీస్ లిమిటెడ్ఆంధ్రప్రదేశ్లో ప్లాంట్ ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది. మహారాష్ట్రలో ఏర్పాటు చేయాలనుకున్న ప్లాంట్‌ను ఏపీకి తరలించే ఆలోచనలో ఈ సంస్థ ఉంది ఎందుకంటే ప్లాంట్‌కు తగినంతగా ఆర్థిక ప్రోత్సాహకాలు ఇచ్చే విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం చాలా సమయం తీసుకొంటోందని అందుకే దీనికి ప్రత్యామ్నయంగా ఇప్పటికే తాము ఏపీ ప్రభుత్వంతోనూ సంప్రదించామని సంస్థ ఛైర్మన్ నుస్లీ వాడియా తెలిపారు. త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన ప్రకటించారు.
వచ్చే ఏడాది 400 నుంచి 500 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ చైర్మెన్ నుస్లీ ఎన్. వాడియా తెలిపారు. కంపెనీ ఉత్పత్తి సామార్ధ్యం పెంపు, నూతన ఉత్పత్తి అభివృద్ధిపై దృష్టి పెట్టినట్లు ఆయన ప్రకటించారు. మహారాష్ట్ర నుంచి ఆంధ్రప్రదేశ్ కు తరలించే యోచనలో ఉన్న డైరీ ప్లాంట్ కోసం రూ. 300 ఖర్చు పెట్టుబడి పెడతామని పేర్కొన్నారు. శతాబ్ది వేడుకల సందర్భంగా వచ్చే ఆరు నెలలో సంస్థ నుంచి ఎన్నో కొత్త ఉత్పత్తులు రానున్నట్లు ప్రకటించారు. బిస్కెట్ల మార్కెట్లో పార్లే కంటే బ్రిటానియానే టాప్ ప్లేస్‌లో ఉన్నదని అన్నారు.