Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కర్ణాటకలో ఎన్నికల హడావిడి అయిపోయిన తర్వాత బిజెపి కన్ను ఇప్పుడు ఆంధ్రా పై పడిందా అంటే అవుననే అనిపిస్తోంది. కర్నాటక ఎన్నికల నుండి జరిగిన పరిణామాలను పరిశీలిస్తే కర్ణాటకలో ఎన్నికల ప్రచారం అయిపోయిన మరుసటి రోజు అమిత్ షా తిరుమల రావటం, ఆ తర్వాత రోజు నుండి కొన్ని సంవత్సరాలు పాటు సైలెన్స్ గా ఉన్న రమణ దీక్షితులు ఒక్కసారిగా మీడియా ముఖంగా విషం చిమ్మే ప్రయత్నం చేయడం, అలాగే నాలుగేళ్ళుగా రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉన్న పవన్ ఇప్పుడు రాష్ట్ర పర్యటన వంకతో యాత్ర మొదలు పెట్టి, అసలు యాత్రే ప్రత్యేకా హోదా ఇవ్వనందుకు నిరసన అని చెప్పి అసలు తన యాత్రలో ఆ ప్రస్తావనే లేకుండా చంద్రబాబు పై, ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఇవన్నీ చూస్తుంటే నటుడు శివాజీ చెప్పిన ఆపరేషన్ గరుడ లో భాగమే అనిపిస్తోంది.
మే 15 తర్వాత పరిస్థితులు మారిపోతాయని ఒక నేత, అలిపిరి రిపీట్ అవ్వుద్దని మరో బీజేపీ నేత ఇలా బాబు సర్కార్ ని బెదిరించే ప్రయత్నాలు చేశారు. అయితే ఇవేమీ పట్టవన్నట్టు ఏకంగా చంద్రబాబే కర్నాటక ఎన్నికల్లో తెలుగు వారు ఎవరు బీజేపీకి వోటు వెయ్యద్దు అని ప్రకటించడం బీజేపీ నేతలకి అయితే మింగుడు పడలేదు అనే చెప్పాలి. ఇక సిబీఐ కేసులు పెడుతుందని చంద్రబాబు ని లోకేష్ ని అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా ఒక వర్గం వదంతులు సృష్టించింది అయితే వేటికీ బయపడకుండా బాబు అదే నిబ్బరంతో ఉండడంతో ఇప్పుడు బీజేపీ గేమ్ ప్లాన్ మార్చినట్టు తెలుస్తుంది.
బీజేపీ ప్లాన్ ప్రకారం వారి రాజీనామాల పై లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈమేరకు వైసీపీ ఎంపీలకు స్పీకర్ కార్యాలయం నుంచి లేఖ అందింది. ఈనెల 29వ తేదీన సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్య కలవాలంటూ లేఖలో పేర్కొన్నారు. ఇటీవలే తమ రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్ ను వైసీపీ ఎంపీలు కోరారు. జూన్ 1వ తేదీన కలవాలంటూ ఈనెల 19న వీరికి స్పీకర్ కార్యాలయం లేఖ రాసింది. తాజాగా స్వల్ప మార్పులు చేసి, ఈనెల 29న వ్యక్తిగతంగా వచ్చి కలవాలంటూ సూచించింది. ఈ నేపథ్యంలో, ఎంపీల రాజీనామాలపై సుమిత్రా మహాజన్ తుది నిర్ణయం తీసుకోబోతున్నారే విషయం అర్ధమవుతోంది అలాగే వారి రాజీనామాలని ఆమోదింపచేసి తద్వారా ఉపఎన్నికలకు పంపే యోచనలో బీజేపీ ఉన్నట్టు స్పష్టం అవుతోంది.
ఎటూ రాజీనామా చేసిన ఎంపీ స్థానాలు అన్నీ వైకాపా కి కంచుకోట లాంటివే సో అలానే ఎన్నికలకి వెళ్లి అక్కడ వైకాపా అభ్యర్ధులని గెలిపించి రాష్ట్రంలో అందరూ వైకాపా వైపే ఉన్నారు అనే ఒక అభిప్రాయం ప్రజల మైండ్ లలోకి జొప్పించి తర్వాత చంద్రబాబు అవినీతి వల్లే మేము హోదా కానీ ప్యాకేజ్ కానీ ఇవ్వలేదు ఇప్పుడు జగన్ వంటి నాయకుడి మీద నమ్మకంతో ఇస్తున్నాము, లేదా మరో కోణంలో పవన్ వంటి నేతను చూసి ఇస్తున్నాం అనే మాటతో అసెంబ్లీ ఎన్నికలకి వెళ్ళడం బీజేపీ యోచనలా కనిపిస్తోంది. అయితే ఏమి జరగనుందో కాలమే తేల్చాలి మరి.