ఇలియాన ఎంపిక తప్పుడు నిర్ణయం

audience comments on ileana RE entry in Telugu FIlm industry

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తెలుగులో ఒకప్పుడు ఇలియానా స్టార్‌ హీరోయిన్‌, తెలుగులో మొదట కోటి, ఆపై పారితోషికం తీసుకున్న హీరోయిన్‌ ఇలియానా అని చెప్పుకోవచ్చు. సౌత్‌లో విపరీతమైన క్రేజ్‌ ఉన్న సమయంలోనే ఇలియానా బాలీవుడ్‌కు వెళ్లి పోయింది. అక్కడ భారీ ఎత్తున ఛాన్స్‌లు దక్కించుకుంది. అయితే ఆ ముచ్చట మూడు నాళ్లముచ్చటగానే మిగిలి పోయింది. బాలీవుడ్‌లో కొన్నాళ్లకే ఈ అమ్మడి కెరీర్‌కు ఫుల్‌స్టాప్‌ పడ్డట్లయ్యింది. బాలీవుడ్‌లో దాదాపు సంవత్సరం పాటు పెద్దగా ఆఫర్లు లేక, సౌత్‌కు రాలేక ఈమెకు అక్కడే ఉండి పోయింది. ఆ సమయంలోనే ఈమె పెళ్లికి సిద్దం అయ్యింది. రష్యాకు చెందిన ఒక వ్యక్తితో ఈ అమ్మడి వివాహం ఇటీవలే జరిగింది. పెళ్లి తర్వాత ఈమె మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంది. ఆమె ఎంట్రీ ఇవ్వానుకుంది, శ్రీనువైట్ల వెంటనే ఆమెను ఎంపిక చేసేశాడు.

వరుసగా డిజాస్టర్‌ను చవిచూసిన శ్రీనువైట్లకు రవితేజ ఛాన్స్‌ ఇచ్చాడు. ప్రస్తుతం రవితేజ హీరోగా ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ చిత్రం తెరకెక్కుతుంది. అందుకు సంబంధించిన షూటింగ్‌ జరుగుతుండగా హీరోయిన్‌ అను ఎమాన్యూల్‌ తప్పుకుంటున్నట్లుగా ప్రకటించింది. ఆమె తప్పుకుంటున్నట్లుగా ప్రకటించినా, అసలు విషయం తప్పించారు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇక అను స్థానంలో ఎవరు వస్తారా అని ఎదురు చూస్తున్న సమయంలో ఇలియానాను శ్రీనువైట్ల ఎంపిక చేశాడు. తెలుగు ప్రేక్షకులు దాదాపుగా మర్చిపోయిన ఇలియానాను ఇప్పుడు ఎంపిక చేయడం తప్పుడు నిర్ణయం అంటూ కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాని రవితేజకు ఆమె సరైన జోడీ అంటూ దర్శకుడు అభిప్రాయపడుతున్నాడు. అందుకే ఆమెకు ఛాన్స్‌ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి సినిమా పూర్తి అయ్యి, విడుదలైన తర్వాత శ్రీనువైట్ల తీసుకున్న నిర్ణయం ఫలితం తేలే అవకాశం ఉంది.