ప్రయాగ్‌రాజ్‌కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కుటుంబ సమేతంగా ప్రయాగ్‌రాజ్‌ మహాకుంభమేళాకు వెళ్లనున్నారు. త్రివేణి సంగమం లో పవిత్ర స్నానం చేయనున్నారు. అనంతరం ప్రయాగ్ రాజ్‌లో ప్రత్యేక పూజలు చేస్తారు. పవన్‌ కల్యాణ్‌తో కలిసి యూపీ సీఎం యోగి పుణ్యస్నానం చేస్తారు. పవన్ రాకతో కుంభమేళాలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇప్పటికే కేరళ, తమిళనాడులోని పలు ఆలయాలు సందర్శించిన పవన్ మంగళవారం మధ్యాహ్నం ప్రయోగ్‌రాజ్‌కు బయలుదేరి వెళతారు.