రంజాన్ నియమాలపై జగన్ ప్రభుత్వం స్పెషల్ జీవో జారీ..

సోషల్ మీడియాలో వైరల్ టాపిక్ గా మారిన జగన్

దేశంలో కరోనా వైరస్ రోజురోజుకూ విపరీతంగా వ్యపిస్తుంది. ఇదే సమయంలో ఈ లాక్ డౌన్ వేళ.. రాంజాన్ పండుగ నెల ప్రారంభమైంది. దీంతో ప్రత్యేక సడలింపులిస్తూ జీవో నంబర్ 721ని జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ జీవో ప్రకారం చాలా పరిమితంగా మాత్రమే మసీదుల్లో ప్రార్థనలు చేసుకోవాల్సి ఉంటుంది. మసీదుల్లో ఉండే ఇమామ్ హుస్సేన్ తో పాటు మరో ముగ్గురు కమిటీ సభ్యులకు మాత్రమే అనుమతి ఇస్తారు. మిగిలిన వారు ఎవరి ఇళ్లల్లో వారే ప్రార్థనలు చేసుకోవాల్సి ఉంటుందని ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది

అదేవిధంగా ఇమాం మౌజమ్ లకు ప్రత్యేక పాస్ లు జారీ చేయనున్నారు. రోజుకు ఐదు సార్లు ప్రార్థన చేసుకోవచ్చని.. ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం. మరో వైపు కరోనా నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కూడా అందులో స్పష్టం చేసింది. మసీదుల వద్ద బ్యానర్లను కట్టాలనీ.. భౌతిక దూరాన్ని పాటించాలిని కూడా వెల్లడించింది. ఉపవాస దీక్షల నేపథ్యంలో పౌష్టికాహారం అందించేందుకు ప్రత్యేక సడలింపుల కూడా ఇచ్చింది. నిత్యావసర వస్తువులు కూరగాయలు, పండ్ల షాపులకు ఉదయం 10 గంటల వరకు అనుమతి ఇస్తారని పేర్కొంది.

అంతేకాకుండా ఇఫ్తార్ కు అనుగుణంగా సాయంత్రం డ్రై ఫ్రూట్స్ షాపులకు అనుమతి లభించనుంది. ఆహారం అందించే దాతలకు ప్రత్యేక సమయాలు కేటాయించారని.. ఉదయం 3 నుంచి 4:30 వరకు, సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకూ అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది. కాగా అన్ని చోట్లా కాకుండా కేవలం 3,4 పాయింట్లను గుర్తించి అక్కడే ఆహారాన్ని అందించాల్సి ఉంటుంది. అది కూడా భౌతిక దూరాల్ని పాటిస్తూనే ఉండాలని.. ముందే కొన్ని హోటల్స్ ని గుర్తించి సహరీ, ఇఫ్తార్ సమయాల్లో టేక్ ఎవే అనుమతిస్తారని స్పష్టం చేసింది. అలాగే.. క్వారెంటైన్ లో ఉన్న ముస్లింలకు పండ్లు డ్రై ఫ్రూట్స్ అందిస్తారని.. ఉదయం సాయంత్రం పౌష్టికాహారం అందించాలని ఆదేశించింది ఏపీ సర్కార్. రంజాన్ నేపథ్యంలో 24 గంటల విద్యుత్ సరఫరా ఉండాలనీ.. అవసరానికి సరిపడా మంచి నీటి సరఫరా కూడా చేయాలని ఈ ఉత్తర్వుల్లో ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.