Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దాచేపల్లి అత్యాచార బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం రూ. 5లక్షల పరిహారం ప్రకటించింది. గుంటూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని హోం మంత్రి చినరాజప్ప పరామర్శించారు. దాచేపల్లిలో గురువారం తలెత్తిన ఉద్రిక్తపరిస్థితులు దృష్టిలో ఉంచుకుని ఎస్పీ పర్యవేక్షణలో నిఘా ఏర్పాట్లుచేశారు.17 పోలీస్ బృందాలతో నిందితుడి కోసం గాలిస్తున్నారు. కృష్ణానది ఒడ్డున డ్రోన్ కెమెరాలతో గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడి పాత ఫొటోను పోలీసులు విడుదల చేశారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు.
తొమ్మిదేళ్ల చిన్నారిపై వృద్ధుడైన ఓ రిక్షా కార్మికుడు అత్యాచారానికి పాల్పడిన దారుణం దాచేపల్లిని కుదిపేసింది. బుధవారం ఈ దారుణం జరగ్గా..బాధితురాలి బంధువులూ, కుటుంబ సభ్యులూ వందలాదిమందితో కలిసి అర్ధరాత్రి దాటిన దగ్గరనుంచి ఆందోళనలు నిర్వహించారు. గురవారమంతా కూడా ఈ ఆందోళనలు కొనసాగాయి. దాచేపల్లిలో పలు రైళ్లను ఆపారు. రెండు బస్సుల అద్దాలు ధ్వంసం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ దారుణం తీవ్ర సంచలనంగా మారిన నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించింది.