ప్రభుత్వ పథకాల ప్రచారంలో మంత్రుల ఫోటోలు వాడకూడదు : ఏపీ ప్రభుత్వం

ప్రభుత్వ పథకాల ప్రచారంలో మంత్రుల ఫోటోలు వాడకూడదు : ఏపీ ప్రభుత్వం

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హమీలను ఒక దాని తరువాత ఒకటి నెరవేరుస్తూ తన మార్క్ పాలనతో అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే వైసీపీ అధికారాన్ని చేపట్టిన ఈ ఆరు నెలలలోనే ఎన్నికల ముందు చెప్పిన హామీలనే కాకుండా ఎన్నో సంక్షేమ పథకాలను కూడా సీఎం జగన్ అమలులోకి తీసుకొచ్చారు.

అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక మీదట ప్రభుత్వ పథకాల ప్రచారంలో మంత్రుల ఫోటోలు వాడకూడదని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం ఫోటోలను మాత్రమే ప్రచురించాలని అధికారులకు సీఎంవో ఆదేశాలు జారీ చేసింది. మీడియా ప్రకటనలు, సోషల్ మీడియా ప్రచారంలోనూ ఒక్క సీఎం జగన్ ఫోటోను మాత్రమే వాడాలని కోరింది. సుప్రీంకోర్ట్ గైడ్ లైన్స్ ప్రకారమే వ్యవహరించాలని అధికారులకు సీఎంవో ప్రకటన విడుదల చేసింది.