రాజాకీయంగా చైతన్య వంతమైన గుంటూరు జిల్లాలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికలు దగ్గరపడడంతో జంపింగ్ లు ఎక్కువయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటును ప్రభావిస్తం చేయగల జిల్లా కావడంతో అధికార పార్టీ కూడా ఈ జిల్లా మీద ప్రత్యేక శ్రద్ద పెట్టింది. జిల్లాలో పార్టీ మారే నేతల సమాచారం కోసం ఇంటెలిజన్స్ ను కూడా రంగంలోకి దింపినట్టుసమాచారం. మొన్నటి దాకా ప్రధాన పోటీ వైసీపీ-టీడీపీల మధ్యే ఉండేది కానీ పవన్ కళ్యాణ్ జనసేన కూడా ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయనుండడం తో రాజకీయం రసవత్తరంగా మారింది.
ఎక్కువగా కాంగ్రెస్ నుండి లేదా ప్రజారాజ్యంలో పోటీ చేసి ఇప్పుడు తెరమరుగు అయిపోయిన వారు జనసేన గూటికి చేరుతున్నారు. వీరే కాక గత ఎన్నికల్లో టికెట్ రాని వారు, ఈసారి రాదనీ క్లారిటీ వచ్చేసిన వారు జనసేనను ప్రత్యామ్నాయంగా మార్చుకుంటున్నారు. అంతేకాక జగన్ ఒకే నియోజకవర్గానికి ఇద్దరు, ముగ్గురు సమన్వయకర్తలను నియమించడం పార్టీలో వర్గాలకు తావిస్తోంది. చిలకలూరిపేట నియోజకవర్గంలో విడదల రజనీ చేరిక ఆమెకు సమన్వయకర్త పదవి ఇవ్వడమే దానికి ఉదాహరణ. దీంతో జిల్లాలో ఎప్పుడు ఏ చేరిక ఉంటుంది, దాని వలన తెలుగుదేశానికి లాభమా, వైసీపీకి లభామా అని పరిశీలించడానికి ఇంటెలిజన్స్ ను కూడా ప్రభుత్వం రంగంలోకి దింపినట్టు సమాచారం.