Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
2019 ఎన్నికలకు ముందు కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టనున్న చివరి బడ్జెట్ దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఏపీకి చాలా ముఖ్యమైనది. బడ్జెట్ నిధుల విడుదలకు సంబంధించి రాష్ట్రానికి ఇది చివరి అవకాశం. విభజన జరిగి నాలుగేళ్లు కావొస్తున్నా..ఇప్పటిదాకా కేంద్రం నుంచి వచ్చిన నిధులు అంతంత మాత్రమే. విభజన బాధిత ఏపీని ప్రత్యేక రాష్ట్రంగా చూస్తామన్న హామీని కేంద్రం నెరవేర్చలేదు. మిగిలినరాష్ట్రాలకిచ్చినట్టు మాత్రమే నిధులు కేటాయిస్తోంది. ఈ సారి బడ్జెట్ లో మాత్రం రాష్ట్రానికి న్యాయం జరుగుతుందన్న ఆశాభావంతో ఏపీ ప్రభుత్వం ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సమస్యల జాబితా, పెండింగ్ లో ఉన్న నిధుల నివేదికను కేంద్రానికి పంపింది. అయితే మరిన్ని వివరాలు కావాలని పీఎంవో అధికారులు కోరడం ఏపీకి ఆశలు పెంచింది. రాజధాని నిర్మాణం, ఆర్థిక సంఘం నిధులు, ద్రవ్యలోటు, పారిశ్రామిక ప్రోత్సాహకాలు, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల విడుదలకు సంబంధించిన డిమాండ్లను ఏపీ ప్రభుత్వం కేంద్రం ముందుంచింది.