Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాష్ట్ర విభజన జరగక ముందు ఒక మాట, జరిగిపోయిన తరువాత ఒక మాట మార్చి విభజన హామీలు నెరవేర్చకుండ కావాలని తాత్సారం చేస్తున్నకేంద్ర అధికార పార్టీ బీజీపీ మీద ఇప్పటికే ఏపీ టీడీపీ అధినేత మొదలుకొని నేతలు సైతం అటు కేంద్రాన్ని, బీజీపీని అలాగే ప్రధాని నరేంద్ర మోడీని అనేక విధాలుగా విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అందుకు బిజెపి నేతలు సోము వీర్రాజు, విష్ణు కుమార్ రాజు, మాణిక్యాల రావు వంటి వారు కాస్త డిఫెన్స్ లో పడినప్పటికీ టీడీపీ నేతలు మాత్రం వెనకకి తగ్గడం లేదు. ఇప్పటికే ఢిల్లీ లో పార్లమెంట్ ఆవరణలో ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వనందుకుగాను, బిజెపికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు, నిన్న పార్లమెంట్ సెంట్రల్ హాలులో చంద్రబాబు పలు పార్టీల నేతలతో సమావేశమయిన విషయం తెలిసిందే.
అయితే టీడీపీ మంత్రి జవహర్ ప్రధాని నరేంద్ర మోదీ ని ఉద్దేశించి ఆయన దేశంలోనే అత్యంత పిరికిపంద అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిన్న తెలుగు న్యూస్ ఛానల్ ఒకదానిలో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు ఏపీలో తమిళనాడు తరహా రాజకీయాలు చేయాలని చేస్తే ఇక్కడ కుదరని పని అని, బెదిరించి లొంగదీసుకోవాలని చూస్తున్నారని మోదీ పై ఆయన మండిపడ్డారు. అదే విధంగా బీజేపీ కొత్త స్నేహం కుదుర్చుకుందని, జైలులో ఉండాల్సిన వ్యక్తులు బయటికి వచ్చి.. రాజకీయాలు చేస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రధాని కార్యాలయాన్ని సైతం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రలోభపెడుతున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై ఆయన నిప్పులు చెరిగారు. ఏపీకి ఈ రెండు పార్టీలు అన్యాయం చేశాయని అన్నారు.