ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు శుభవార్త. దేశవ్యాప్తంగా ప్రస్తుత సీజన్ లో 10 లక్షల టన్నుల కందులను సేకరించాలని జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ సమాఖ్య నిర్ణయం తీసుకుంది. దీంతో వచ్చే వారం నుంచి రైతుల నుంచి ఆర్బికే అధికారులు కందుల కొనుగోళ్లకు సిద్ధమవుతున్నారు.
ఇందులో ఏపీలోని ఆర్బికేల నుంచే ఏకంగా 50 వేల టన్నులను కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో వచ్చేవారం నుంచి ఆర్ బి కే అధికారులు కందులను కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో కనీసం మద్దతు ధరకు క్వింటా 9500 నుంచి 10,500 వరకు మించి ఉంది.
ఇప్పుడు ఏపీ రైతుల నుంచి కూడా అదే ధరకు కొనుగోలు చేసేందుకు జాతీయ సంస్థ సిద్ధమైంది. కాగా, నేడు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. సచివాలయంలో సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభం అవుతుంది. మిచౌంగ్ తుఫాన్, ప్రభుత్వం చేపట్టిన సహాయ, పునరావాస కార్యక్రమాలు, పంట నష్టం, పెన్షన్ పెంపు సహా పలు కీలక అంశాలపై ఆంధ్రప్రదేశ్ కేబినెట్ చర్చించనుంది.