వైయస్ షర్మిలపై రాంగోపాల్ వర్మ సంచలన కామెంట్స్ చేశారు. వ్యూహం సినిమాకి సంబంధించి ఒక ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. షర్మిల పాత్ర వ్యూహం సినిమాలో ఉంటుంది కానీ ఏం చెయ్యలేదన్నారు. రియల్ లైఫ్ లో కూడా సీఎం జగన్ కి షర్మిల ఏం చేయలేదని యాంకర్ అడిగిన ప్రశ్నకి ఆర్జీవి సమాధానం చెప్పారు. జగన్ జైలులో ఉన్నప్పుడు ఆయనకి బయటకు రావడానికి యాక్సిస్ లేనప్పుడు షర్మిల ఎంట్రీ ఇచ్చారని అన్నారు.
ప్రజలు షర్మిలతో జగన్ ని చూసుకోవడానికి మీటింగులకి వచ్చారన్నారు అంతేకానీ షర్మిల కోసం రాలేదని అన్నారు. జగన్ కోసం షర్మిల ఎంట్రీ ఇచ్చినప్పుడు భారీగా క్రౌడ్ వచ్చింది అన్నారు. స్వయంగా షర్మిల్ తానూ వదిలిన బాణం అని చెప్పారని ఆర్జీవీ గుర్తు చేశారు. జగన్ వదిలిన బాణం జగన్ కి గుచ్చుకునేందుకు వస్తోందని చెప్పారు. జగన్ ఐరన్ లాంటివాడని బాణమే విరుగుతుందని సెటైర్లు వేశారు.