ఏపీలోనూ 6 గ్యారంటీలు అమలు చేస్తామని ప్రకటన చేశారు మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నేత చింతా మోహన్. అందులో ప్రత్యేక సహా…అంగన్ వాడీలు కార్మికుల సమస్యలు అన్ని ఉంటాయని వివరించారు. అలాగే, కాంగ్రెస్ 33 మంది వైసీపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ టచ్ లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల రాకతో కాంగ్రెసు పార్టీ పునర్ వైభవం వస్తుంది..వైసిపికి చెందిన 33 మంది ఎమ్మెల్యే, కొందరు ఎంపిలు మాతో టచ్ లో ఉన్నారని బాంబ్ పేల్చారు. జనవరి నాటికి పాత నేతలందరూ కాంగ్రెసు గూటికి వస్తారని తెలిపారు. జగన్ లా షర్మిల మోసం చేయదని అడిగాను… అలా చేయారని మా పెద్దలు చెప్పారని తెలిపారు.
సిఎం రేవంత్ రెడ్డి ఏపీలో ప్రచారం చేస్తారు…జగన్ వల్ల కాంగ్రెసు కు నష్టం జరిగింది…అది షర్మిలతో భర్తీ అవుతుందన్నారు. మా పార్టీనేతలను జగన్ తన వెంట తీసుకెళ్ళారు..ఇప్పుడు వారంతా సోంత ఇంటికి రావడానికి రెడిగా ఉన్నారని తెలిపారు. రాయలసీమకు చెందిన చాలామంది రెడ్లు, ఈస్ట్ ,వేస్ట్ లోని కాపు సీనియర్ నేతలు రావడానికి సిద్దంగా ఉన్నారు..స్టార్ క్యాంపెనర్ గా షర్మిల ఉన్న నేపధ్యంలో చిరంజీవి పరిస్థితి ఎంటనే ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నేత చింతా మోహన్.