AP Politics: వచ్చే ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తా: మంత్రి రోజా

AP Politics: Will definitely contest next election: Minister Roja
AP Politics: Will definitely contest next election: Minister Roja

వచ్చే ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా ప్రకటించారు . గత కొన్ని రోజులుగా మంత్రి రోజాపై ఓ ప్రచారం సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో రోజాకు టికెట్‌ ఇవ్వరని..ఈ మేరకు సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. అయితే.. దీనిపై రోజా స్పందించారు. తిరుమల శ్రీవారిని ఇవాళ మంత్రి రోజా దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ….రాబోవు ఎన్నికలో రోజాకు టికెట్‌ రాదని కొంత మంది శునకానందంతో చేస్తున్న ప్రచారం మాత్రమేనని తేల్చి చెప్పారు. గడప గడపకు మొదలుకోని అన్ని ప్రభుత్వ కార్యక్రమాలలో ముందు వరుసలో నేనే వుంటున్నానని వెల్లడించారు. ఎన్నికలలో తప్పకూండా పోటీ చేస్తానని ప్రకటించేశారు రోజా. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కే సీట్లు లేకుండా రెండేసి నియోజకవర్గాలలో సర్వే చేయించుకుంటున్నారని చురకలు అంటించారు. నేను జగనన్న సైనికురాలుని…ఆయన మాటే నాకు శిరోధార్యమని తెలిపారు రోజా.