ఇవాళ వైసీపీ ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడిస్తామని హెచ్చరించాయి అంగన్వాడీ సంఘాలు. ఏపీ సర్కార్, అంగన్వాడీ సంఘాల మధ్య చర్చలు విఫలమయ్యాయి. ఈ తరుణంలోనే.. అంగన్వాడీ సంఘాలు.. ఏపీ సర్కార్ కు వార్నింగ్ ఇచ్చాయి. మేం సమ్మె వాయిదా వేసే ప్రసక్తే లేదని..అంగన్వాడీలను ప్రభుత్వం ఓ పక్క బుజ్జగిస్తూ.. మరోపక్క బెదిరిస్తోందని మండిపడ్డాయి సంఘాలు.
ఇప్పటికీ మా డిమాండ్లను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్ల లేదని మంత్రి బొత్స చెప్పారు…మా సమస్యను ఇంకా సీఎం దృష్టికి తీసుకెళ్లక పోవడమేంటీ..? ఫైర్ అయ్యాయి అంగన్వాడీ సంఘాలు. సీఎం దగ్గర వీళ్లు మంత్రులుగా ఉన్నారా.. లేదా..? అనే అనుమానం వస్తోంది…సంక్రాంతి వరకు సమ్మెను వాయిదా వేస్తే సమస్య పరిష్తరిస్తామని మంత్రి చెబుతున్నారన్నాయి. 15 రోజుల్లో ఈ ప్రభుత్వానికి ఏమైనా బంగారపు గనులు వచ్చేస్తాయా..? అంగన్వాడీల జీతాలు పెంచడానికే ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవా..? అంటూ నిలదీశాయి అంగన్వాడీ సంఘాలు. వచ్చే నెల మూడో తేదీన కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం చేపడతామని హెచ్చరించాయి.