AP Politics : చంద్రబాబు కుటుంబానికి వైఎస్ షర్మిల క్రిస్మస్‌ కానుక

AP Politics: YS Sharmila's Christmas gift to Chandrababu's family
AP Politics: YS Sharmila's Christmas gift to Chandrababu's family

తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మూడ్రోజుల ముందు నుంచే క్రిస్మస్ సందడి షురూ అయింది. సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా ఈ వేడుకల్లో మునిగి తేలుతున్నారు. ఈ సందర్భంగా కొందరు ప్రముఖులు తమ సన్నిహితులు, స్నేహితులకు క్రిస్మస్ కానుకలను పంపిస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబ సభ్యులకు సీఎం జగన్‌ సోదరి, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల క్రిస్మస్‌ కానుక పంపించారు.

ఈ కానుకతో పాటు పాటు ‘‘ద వైఎస్‌ఆర్‌ ఫ్యామిలీ విషెస్‌ యూ.. ఏ డిలైట్‌ఫుల్‌ క్రిస్మస్‌ అండ్‌ ఏ బ్లెస్డ్‌ 2024’’ అని రాసి ఉన్న గ్రీటింగ్‌ కార్డునూ షర్మిల పంపించారు. ఈ విషయాన్ని ఎక్స్‌ వేదికగా టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పంచుకున్నారు. షర్మిలకు ధన్యవాదాలు తెలియజేశారు. అద్భుతమైన కానుకలు పంపినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ లోకేశ్ థాంక్స్ చెప్పారు. “నారా కుటుంబం తరఫున మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్‌, నూతన సంవత్సర శుభాకాంక్షలు’’ అని ట్వీట్‌ చేశారు. షర్మిల పంపిన గ్రీటింగ్‌, గిఫ్ట్‌ బాక్స్‌ల చిత్రాలను ట్వీట్‌కు యాడ్ చేశారు.