ఇటీవల వైసీపీని వీడిన విజయసాయిరెడ్డి తన రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ సీటు కూటమి వశమైంది. ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం కూటమిలోని ఏ పార్టీకి కేటాయించాలన్న విషయంపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కలిశారు. ఈ సందర్భంగా రాజ్యసభ స్థానంపై సుదీర్ఘంగా చర్చించారు. 40 నిమిషాల పాటు సాగిన చర్చల అనంతరం రాజ్యసభ స్థానాన్ని బీజేపీకి కేటాయించేందుకు టీడీపీ, జనసేన అంగీకరించాయి.




