ప్రీ-మెట్రిక్ ఉపకార వేతనాలకు దరఖాస్తులు

application for pre metric scholarship

హైదరాబాద్ : జిల్లాలలోని ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వంచే గుర్తింపు పొందిన పాఠశాలల్లో 1 నుంచి పదోతరగతి వరకు చదువుతున్న వికలాంగ (అందులు, బదిరులు, శారీరక వికలాంగులు) విద్యార్థులకు 2019-20 సంవత్సరానికి గాను ప్రీ-మెట్రిక్ ఉపకార వేతనాల కోసం ఆగస్టు 31లోగా జిల్లా మహిళా శిశు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని మహిళా సంక్షేమాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు రూ.700, 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు రూ.1000, 9 నుంచి 10వ తరగతి వరకు రూ.1820 ఉపకారవేతనాలు మంజూరైన విద్యార్థులకు అందజేయడం జరుగుతుందన్నారు. దరఖాస్తులో ఆదాయ, కుల, నివాస పత్రంతో పాటు మెడికల్ బోర్డు ధ్రువపత్రం, వికాలంగత్వం కనిపించే ఫొటో, గత సంవత్సరం చదివి మార్కుల జాబితాను జతచేయాలని సూచించారు.