త్రివ్రికమ్ ని లీకులు వదలవా…!

Aravinda Sametha Movie Shooting Pics Leaked

పాపం త్రివిక్రమ్ సినిమాలకి లీకుల బెడద ఇప్పటిలా తప్పేలా లేదు, ఆయన దర్శకత్వంలో ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘అరవింద సమేత’కు సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్‌లో లీకవడంపై యూనిట్ తలలు పట్టుకుంటోంది. రాయల సీమ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ తెరకెక్కుతుందని గాసిప్ లు వస్తుండగా, ఈ చిత్ర బృందాన్ని లీకుల సమస్య వేధిస్తుంది. ఇదివరకే కొన్ని మూవీ స్టిల్స్ కొన్ని బయటకి రాగా, జాగ్రత్త పడిన దర్శకుడు త్రివిక్రమ్ ఇకపై షూటింగ్ స్పాట్‌లోకి ఎవరూ ఫోన్లు తీసుకురాకూడదని ఆదేశాలు జారీ చేశాడట. అయినప్పటికీ తాజాగా ఫొటోలు లీకవడం యూనిట్‌ను కలవరపెడుతోంది.

Aravinda Sametha Movie Shooting Pics Leaked
విడుదలైన ఫొటోలలో సీన్‌కు సంబంధించిన సమయం కూడా ఉండడంతో ఇది ఎడిటింగ్ టేబుల్ మీద నుండే బయటకి వచ్చాయా ? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇవి యాక్షన్ సీన్స్ కి సంబంధించినవిగా తెలుస్తుంది. ఇంతకు ముందు లీక్ అయిన ఫోటోకి కొనసాగింపుగా ఈ పిక్స్ ఉన్నాయి. అయితే ఈ నెల 15న విడుదలా కానున్న టీజర్ పిక్స్ అని కూడా సోషల్ మీడియా లో ప్రచారం సాగుతోంది. అయితే పిక్స్ విషయాన్నీ సీరియస్ గా తీసుకున్న దర్శకనిర్మాతలు కారణమైన వారెవరో తెలుసుకునే పనిలో ఉన్నారు. దసరా కానుకగా ఈ మూవీ భారీ అంచనాలతో విడుదల కానుంది. హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్నఈ చిత్రంలో ఎన్టీఆర్ జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. జగపతిబాబు, నాగబాబులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Aravinda Sametha Movie Shooting Pics Leaked