యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన క్రేజీ మూవీ ‘అరవింద సమేత వీర రాఘవ’ ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ నోవోటెల్లో ఘనంగా జరుగుతోంది. ఈ వేడుకకు సుమ యాంకర్‌గా వ్యవహరిస్తున్నారు. ముందుగా ప్రకటించినట్టుగానే అరవింద సమేత వీర రాఘవ ట్రైలర్ కొద్దిసేపటి క్రితం విడుదల చేసారు. ఇప్పటికే విడుదల అయిన చిత్ర టీజర్ అంచనాలు రేపగా ఇప్పుడు ట్రైలర్ అంతకు మించి అనిపించేలా ఉంది. మీరు కూడా ఒక లుక్ వేసెయ్యండి మరి