అర్చనలో అది లేకపోవడం వల్ల అవకాశాలు రావడంలేదట

archana response on tamil director comments

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

తెలుగులో ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మరియు ఐటెం సాంగ్స్‌ను చేసిన ముద్దుగుమ్మ అర్చన. తాజాగా ఈమె బిగ్‌బాస్‌లో ఫైనల్‌ వరకు వెళ్లడంతో మరింత క్రేజ్‌ ఈమెకు దక్కింది. హీరోయిన్‌గా మళ్లీ ఈమెకు అవకాశాలు వస్తున్నాయి. తెలుగుతో పాటు తమిళం మరియు బాలీవుడ్‌లో కూడా ఈమె కొన్ని సినిమాలు చేసింది. అయితే తమిళంలో ఒక దర్శకుడు ఈమె గురించి ఒక ఆసక్తికర వ్యాఖ్య చేసింది. అదేంటి అంటే అందంగా కనిపించే అర్చన ప్రవర్తన మాత్రం అందంగా ఉండదని, స్మూత్‌గా ఉండదని, అందుకే ఆమె హీరోయిన్‌గా సక్సెస్‌ కాలేక పోయింది అంటూ చెప్పుకొచ్చాడు.

archana

ఆ విషయంపై తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అర్చన మాట్లాడుతూ.. ఆయనకు అలా అనిపించడం నా తప్పు కాదని, నేను ఎలా అయితే ఉండాలనుకుంటానో అలాగే ఉంటాను అని, నా ప్రవర్తన సినిమాల్లో నటించడం కోసం మార్చుకోవాల్సిన అవసరం నాకు లేదని, తాను మొదటి నుండి ఒకరికి తలొగ్గే రకాన్ని కాదు అంటూ అర్చన చెప్పుకొచ్చింది. సక్సెస్‌ వచ్చినప్పుడు తనపై వస్తున్న విమర్శలు అన్ని కూడా కొట్టుకు పోతాయని, ఎవరేమనుకున్నా, ఎవరేమన్నా కూడా నాపై నాకు చాలా నమ్మకం ఉందని, ఆ నమ్మకం నన్ను నడిపిస్తుందని అర్చన చెప్పుకొచ్చింది. సక్సెస్‌ లేకున్నా ఇన్నాళ్లు ఇండస్ట్రీలో కొనసాగుతున్నాను అంటే నమ్మకంతోనే అంటూ అర్చన చెప్పుకొచ్చింది.

archana-up--dates