Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
విజయ్ దేవరకొండ, షాలిని జంటగా తెరకెక్కిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాలు మరియు ఓవర్సీస్లో ఊహించని కలెక్షన్స్‌ను రాబడుతుంది. ఒక పెద్ద సినిమా స్థాయిలో ఈ సినిమా వసూళ్లను రాబడుతుంది. ఇప్పటికే కలెక్షన్స్ లాభాల్లో నడుస్తున్నాయని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. స్టార్ హీరోలకు సైతం కొన్ని సార్లు సాధ్యం కాని ఓవర్సీస్ మిలియన్ మార్క్‌ను ఈ చిత్రం చాలా సులభంగా క్రాస్ చేసింది. ఇంతగా ఆధరణ పొందుతున్న ఈ సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి క్రేజ్ ఒక్కసారిగా పెరిగి పోయింది. సందీప్ తర్వాత సినిమా శర్వానంద్‌తో ఉండనుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. శర్వానంద్‌తో పాటు అల్లు అర్జున్ కూడా సందీప్‌తో సినిమా చేసేందుకు సిద్దంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.
‘అర్జున్ రెడ్డి’ విడుదల తర్వాత అల్లు అర్జున్ స్వయంగా దర్శకుడు సందీప్‌కు ఫోన్ చేసి అభినందించినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో గతంలో కథ ఉందన్నారు, ఒకసారి కలుద్దాం, కథ చర్చిద్దాం అంటూ స్వీట్ న్యూస్ చెప్పాడట. దాంతో దర్శకుడు సందీప్ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ రెండు మూడు సినిమాలకు కమిట్ అయ్యి ఉన్నాడు. ఆ సినిమాలు పూర్తి అయ్యేలోపు శర్వానంద్‌తో ఒక క్యూట్ లవ్‌స్టోరీని తెరకెక్కించాలని భావిస్తున్నాడు. అన్ని అనుకున్నట్లుగా అయితే వచ్చే సంవత్సరం చివర్లో అల్లు అర్జున్‌తో సందీప్ సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి. ఒక చిన్న చిత్రంతో ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకున్న దర్శకుడు సందీప్ ముందు ముందు మరెంత మంది స్టార్ హీరోలతో సినిమాలు చేస్తాడో చూడాలి.
మరిన్ని వార్తలు: