బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ తరువాత ఇప్పుడు చిత్ర విచిత్ర టాస్క్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్. ఈ క్రమంలో ఈ రోజు ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ అయింది . నిన్నటి ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ తమ అర్హతలను బట్టి ర్యాంక్ వైజ్ గా నిలబడాలని చెప్పారు బిగ్ బాస్. హౌస్ లో ఉన్నవారంతా చర్చించుకొని ఒకటి నుంచి పది వరకు నిలబడ్డారు. ఇంటి సభ్యులంతా ఏకాభిప్రాయంతో శివాజీకి నెంబర్ 01, యావర్‌కి నెంబర్ 02, ప్రశాంత్‌కి నెంబర్ 03, ప్రియాంక 4 , శోభా 5, అమర్ 6, గౌతమ్‌కి 7, అర్జున్‌కి 8 , అశ్విని 9, రతికాకు 10 స్థానాలు కూడా ఇచ్చారు. ఇక నేటి ఎపిసోడ్ లో ఏవిక్షన్ పాస్ కోసం టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్ గారు . తాజాగా వదిలిన ప్రోమోలో అర్జున్ కు టాస్క్ ఇచ్చినట్టు తెలియచేసారు .
video : https://youtu.be/7HFkhybT4Yo
అర్జున్ ను పిలిచిన బిగ్ బాస్ తన ఏవిక్షన్ పాస్ ని ఒకటి నుంచి ఐదు వరకు ర్యాంక్ లలో ఉన్న మెంబర్స్ లో పోరాడి డిఫెండ్ చేసుకోవాలని చెప్పాడు. ఏ ఆటలో ఓడిన వారు ఏవిక్షన్ పాస్ రేస్ నుంచి మొత్తానికే తప్పుకుంటారు అని చెప్పారు బిగ్ బాస్. ఇక ఇచ్చిన ఛాలెంజ్ లో ఫ్లాట్ ఫామ్ పై ఉన్న స్లాట్స్ లో ఐదు బాల్స్ ను బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుందని చెప్పారు బిగ్ బాస్. అర్జున్ ఈ ఛాలెంజ్ కోసం యావర్ ను ఎంచుకున్నాడు అంబటి అర్జున్.
అలాగే ఈ ఛాలెంజ్ కు అమర్ దీప్ సంచలక్ గా ఉన్నారు . బజార్ మోగగానే ఇద్దరు గేమ్ స్టార్ట్ చేశారు. ఇద్దరు పోటాపోటీగా గేమ్ ఆడతారు . ఆతర్వాత రతికా అమర్ కు అర్జున్ కి పుల్ల పెట్టె ప్రయత్నం చేసింది. సంచలక్ గా ఉన్న అమర్ ఏమైనా చేస్తాడని అనుకున్నా అని అర్జున్ తో చెప్పింది. దాంతో అశ్విని అమర్ కూడా ఏం చేయలేడు అని అనింది . ఆతర్వాత గ్రూప్ గ్రూప్ గా ఆడుతున్నారని అనిపిస్తుంది అని రతికా అర్జున్ కు చెప్పింది. మరో వైపు శివాజీ, యావర్, ప్రశాంత్ కుర్చీని ఉండగా యావర్ ఒకేవేళ నేను చీట్ చేస్తే నేను చెప్తాను బిగ్ బాస్ కు అని అన్నారు . రతికా ఎందుకు అలా తయారైయింది అని అంటూ శివాజీ ప్రశాంత్, యావర్ తో డిస్కషన్ పెట్టాడు.