Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
* ఇంటిగ్రేటెడ్ బీఈడీనీ తీసుకుని వస్తున్నాం. * ప్రభుత్వ పాఠశాలల్లో బ్లాక్ బోర్డు విధానాన్ని డిజిటల్ గా మారుస్తాం. * గిరిజన ప్రాంతాల కోసం ఏకలవ్య ఆదర్శ పాఠశాలలు. * విద్యాభివృద్ధికి జిల్లాల వారీగా ప్రత్యేక కార్యక్రమాలు. * వడోదరలో రైల్వే విశ్వవిద్యాలయం ఏర్పాటు. * గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు రూ. 14.34 లక్షల కోట్లు. * ప్రజలందరి ఆరోగ్యం కోసం ఆయుష్మాన్ భవ. * ఆరోగ్య రక్షణకు జాతీయ ఆరోగ్య విధానం. * 10 కోట్ల నిరుపేద కుటుంబాలకు ఏటా రూ. 5 లక్షల మేరకు వైద్యం ఉచితం. * 50 కోట్ల మంది జనాభాకు ఈ పథకం ద్వారా లబ్ది. * ప్రతి మూడు పార్లమెంటు నియోజకవర్గాలకూ ఒక వైద్య కళాశాలు, ఆసుపత్రి. * ప్రతి ఒక్కరికీ రూ. 330 ప్రీమియంతో రూ. 5 లక్షల బీమా. * ప్రతి పౌరునికీ సమీపంలోనే వెల్ నెస్ సెంటర్. * వెల్ నెస్ సెంటర్ల ఏర్పాటు కోసం రూ. 1,200 కోట్లు. * 2018-19 వ్యవసాయ రుణాలకు రూ. 11 లక్షల కోట్లు. * నమామి గంగ ద్వారా గంగా ప్రక్షాళన. * గంగానది ప్రక్షాళనకు 187 ప్రాజెక్టుల ద్వారా పనులు. * ఎస్సీల సంక్షేమం కోసం రూ. 56 వేల కోట్లు. * ఎస్టీల సంక్షేమం కోసం రూ. 39 వేల కోట్లు. * ఎంఎస్ఎంఈలకు ఆన్ లైన్ ద్వారా రుణాల మంజూరు. * 2018-19లో రూ. 3 వేల కోట్ల ముద్రా రుణాలు. * ముద్రా రుణాలు పొందిన వారిలో 76 శాతం మహిళలు. * ఫిన్ టెక్ కంపెనీల అభివృద్ధికి ప్రత్యేక ప్రోత్సాహకాలు * చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఎన్పీఏలకు సంబంధించి ప్రత్యేక విధానం. * జీవన ప్రమాణాల మెరుగుదలకు పైలట్ ప్రాజెక్టు కింద 115 జిల్లాల ఎంపిక. * 306 కౌశల్ యోజన కేంద్రాల ఏర్పాటు. * వస్త్ర పరిశ్రమ కోసం ప్రత్యేక ప్రోత్సాహకాలు. * చేనేత, జౌళి రంగాలకు రూ. 7,500 కోట్లు. * మౌలిక సదుపాయాల రంగానికి రూ. 9.4 లక్షల కోట్లు. * ఆందోళన కలిగిస్తున్న క్షయ రోగుల సంఖ్య. * క్షయ వ్యాధిగ్రస్తుల కోసం రూ. 600 కోట్లతో పోషకాహార పథకం. * కొత్త ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు ఈపీఎఫ్ వాటా పెంపు. * కేంద్ర ఈపీఎఫ్ వాటా 8.33 నుంచి 12 శాతానికి హెచ్చింపు. * అన్ని రంగాల్లోని కొత్త కంపెనీలకూ మూడేళ్ల పాటు వర్తింపు. * పర్యాటక రంగంలో ప్రైవేటు పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయం. * పురావస్తు శాఖ కింద ఉన్న 110 కేంద్రాల అభివృద్ధికి కృషి. * గ్రామీణ పారిశుద్ధ్య పథకానికి రూ. 16,713 కోట్లు. * విద్య, ఆరోగ్యం, సంక్షేమం రంగాలకు రూ. 1.38 లక్షల కోట్లు. * చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలకు రూ. 3,790 కోట్లు. * చిన్న పరిశ్రమల మొండి బకాయిల సమస్యను పరిష్కరిస్తాం. * టెక్స్ టైల్ రంగానికి రూ. 7,140 కోట్లు. * రైళ్లలో ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం. * ప్రతి రైలులో సీసీటీవీలు, వైఫై సౌకర్యం ఏర్పాటు. * ఇంటింటికీ తాగు నీటి పథకానికి రూ. 77,500 కోట్లు. * 9 వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల అభివృద్ధి పూర్తి. * స్మార్ట్ సిటీలకు రూ. 2.04 లక్షల కోట్లు. * రైల్వేల మూలధన వ్యయం రూ. 1.48 లక్షల కోట్లు. * వచ్చే రెండేళ్లలో కాపలాలేని 4,267 లెవల్ క్రాసింగ్ ల తొలగింపు. * 600 స్టేషన్ల ఆధునికీకరణను చేపడతాం. * 36 వేల కిలోమీటర్ల రైల్వే ట్రాక్స్ పునరుద్దరణ. * 18 వేల కిలోమీటర్ల రైల్వే లైన్ డబ్లింగ్ పనులు చేపట్టనున్నాం. * అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో ఎస్కలేటర్లు. * ముంబై నగరంలో అర్బన్ రైల్వే వ్యవస్థ ఆధునికీకరణ. * ముంబై లోకల్ స్టేషన్ల కోసం రూ. లక్ష కోట్లు. * 900 కొత్త విమానాల కొనుగోలుకు సిద్ధం. * డిజిటల్ ఇండియా కోసం రూ. 3,073 కోట్లు. * భారత్ నెట్ కార్యక్రమం కోసం రూ. 10 వేల కోట్లు. * బిట్ కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీ విధానాలు చట్ట వ్యతిరేకం. * క్రిప్టో కరెన్సీ వినియోగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోము. * అన్ని రకాల ఆర్థిక సేవల కోసం యూనిఫైడ్ అథారిటీ ఏర్పాటు. * గ్రామాల్లో 5 లక్షల వైఫై స్పాట్స్. * వీటి ద్వారా 5 కోట్ల మందికి దగ్గర కానున్న వైఫై. * ఇప్పటికే లక్ష గ్రామాల్లో బ్రాడ్ బ్యాండ్ సౌకర్యం. * దేశంలో రెండు రక్షణ రంగ ఇండస్ట్రియల్ కారిడార్ల ఏర్పాటు. * పురావస్తు శాఖ కింద ఉన్న 110 కేంద్రాల అభివృద్ధికి కృషి. * ప్రతి వ్యాపార సంస్థకూ ఓ ప్రత్యేక ఐడీ. * సులభతర వాణిజ్యంలో పారదర్శకత సాధిస్తున్నాం. * సైనిక సంపత్తి, ఆయుధాల తయారీలో స్వావలంబనకు కృషి. * ఆయుధ తయారీ రంగంలో విదేశీ పెట్టుబడులకు ప్రోత్సాహం. * రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్ల వేతనాలు పెంపు. * రాష్ట్రపతికి నెలకు రూ. 5 లక్షల వేతనం. * ఉప రాష్ట్రపతికి రూ. 4 లక్షలు, గవర్నర్లకు రూ. 3.5 లక్షలు. * 2020లోగా 50 లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ. * రూ. లక్ష కోట్ల డిజిన్వెస్ట్ మెంట్ లక్ష్యాన్ని చేరుకున్నాం. * 2018-19లో డిజిన్వెస్ట్ మెంట్ లక్ష్యం రూ. 80 వేల కోట్లు. * గోల్డ్ మానిటైజేషన్ విధానంలో మరిన్ని మార్పులు తెస్తాం.