కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ కన్నుమూశారు. అనారోగ్యం దృష్ట్యా కొన్నల్లగా ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూన్న ఆయన ఈరోజు ఉదయం మృతి చెందారు. గత కొన్నాళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నా జైట్లీ శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతుండటంతో ఈనెల 9వ తేదీన ఎయిమ్స్‌లో చేర్చారు కుటుంబ సభ్యులు.
అప్పటి నుంచి ఎయిమ్స్ డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నారు. గుండె సంబంధిత విభాగంలో నలుగురు వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందించిన ప్రయోజనం లేకుండా పోయింది. శ్వాస తీసుకొనేందుకు ఆయన ఇబ్బంది పడుతుండటంతో ఈసీఎంవో కూడా అమర్చారు.
ఆయనకు లైఫ్ సపోర్ట్‌పై ఉంచారు. అయినా ఇవేవి ఆయన్ను బతికించలేకపోయాయి. ఇటీవల అమెరికాకు వెళ్లి దాదాపు నెల రోజులపాటు చికిత్స తీసుకున్నారు జైట్లీ. తిరిగి భారత్‌కు వచ్చిన తర్వాత కూడా చికిత్స కొనసాగించారు.