ఇప్పుడిప్పుడే చైనాలో కరోనా కేసులు వెలుగు చూడటం తగ్గుముఖం పడుతున్న వార్తలు పలువురిలో ఉత్సాహాన్ని కలిగిస్తుంటే.. అదే సమయంలో ఇటలీ లాంటి యూరోపియన్ దేశాల్లో కరోనా విరుచుకుపడుతున్న వైనం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది.
ఒక్కొక్క దేశంలోనూ చాప కింద నీరులా పాకుతూ వస్తున్న కరోనా వైరస్.. ఇప్పుడు అమెరికాలోనూ సమస్యగా మారినట్లు చెబుతున్నారు. అమెరికాలో ఈ వైరస్ విస్తరించకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నా.. కొత్త కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఈ వైరస్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండేందుకు పలు దేశాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి.
కరోనా వ్యాప్తికి కారణంగా చెప్పే షేక్ హ్యాండ్లను ఇచ్చుకోవటానికి ఏ మాత్రం ఇష్టపడటం లేదు. చూసి నమస్కారాలు పెట్టుకుంటూ ఇక.. చాలు అన్నట్లుగా ఉంటున్నారు. ఇదిలా ఉంటే.. భారత దేశంలో మరే రాష్ట్రంలో లేని రీతిలో అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. తమ రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి అవకాశం ఇవ్వకుండా తమ రాష్ట్రంలోకి విదేశీయుల ఎంట్రీకి నో చెప్పేసింది.