Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తమిళ రాజకీయాలు ఎప్పటికప్పుడు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. రేపోమాపో రజని పార్టీ ప్రకటించడమే తరువాయి అనుకున్న తరుణంలో కమల్ అనూహ్యంగా రాజకీయ అంశాలపై గళమెత్తడం మొదలెట్టాడు. రజని కి తమిళేతరుడు అన్న అంశం ప్రధాన అడ్డంకిగా మారిన టైం లో కమల్ ఎంట్రీ కి పిచ్చ రెస్పాన్స్ వస్తోంది. తమిళ నటీనటులు చాలా మంది రాజకీయాల్లోకి కమల్ రావాలని బహిరంగంగా ఆహ్వానం పలుకుతున్నారు. ఖుష్బూ లాంటి కొందరు కమల్ రాజకీయాల్లోకి వస్తే ఆయనకే తమ మద్దతు అని ప్రకటిస్తున్నారు. దీంతో ఎంత ప్రతిభ వున్నా వెండితెర మీద రజని చరిష్మా ముందు కాగిపోయిన కమల్ రాజకీయ యవనిక మీద మాత్రం చిరకాల ప్రత్యర్థి మీద గెలిచేట్టు వున్నాడు.
తమిళ రాజకీయాలు అయోమయంలో కొనసాగుతున్న ఈ తరుణంలో తమిళనాడులోని సేలం లో జ్యోతిష్యుల సదస్సు ఒకటి జరిగింది. ఈ సదస్సులో ఎక్కువ మంది రజని పార్టీ పెట్టినప్పటికీ సీఎం కాలేడని చెప్పారు. ఆదిత్య గురూజీ అనే ప్రముఖ జ్యోతిష్యుడు మరో అడుగు ముందుకు వెళ్లి రజనికి లేని సీఎం అవకాశం కమల్ కి ఉంటుందని అభిప్రాయపడ్డారు. కమల్ కి ఇలాంటి వాటి మీద పెద్దగా నమ్మకాలు లేకపోయినా పరిస్థితులు మాత్రం ఆయన్ని రాజకీయాల వైపు నెడుతున్నట్టు కనిపిస్తున్నాయి.
మరిన్ని వార్తలు: