జగన్ పిలిచినా టీఎస్సార్ పట్టించుకోలేదా ?

Jagan invites to t subbarami reddy in YSRCP

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
2019 ఎన్నికల టార్గెట్ తో మొత్తం 25 లోక్ సభ స్థానాలకు ముందుగా బలమైన అభ్యర్థుల్ని ఖరారు చేయాలని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నారు. ఆ కోవలో ఎంపీ టికెట్ ఆశిస్తున్న వారికి ముందుగా హామీలు దాంతో పాటు పెట్టుకోవాల్సిన ఖర్చుల గురించి ముందుగానే చెబుతున్నారట జగన్. అయితే కొన్ని స్థానాల విషయంలో జగన్ అనుకున్నంత బలమైన అభ్యర్థులు దొరకడం లేదట. దీంతో ఆయనే స్వయంగా ఇతర పార్టీల్లోని బలమైన అభ్యర్థులకు కబురు చేస్తున్నారట. వీరిలో కొందరు ఎస్, మరికొందరు నో చెబుతున్నారట. కానీ ఏ విషయం చెప్పకుండా కాలం గడిపేస్తున్న లిస్టులోకి వచ్చి చేరారట కళాబంధు టి. సుబ్బిరామిరెడ్డి.

విశాఖ లోక్ సభ స్థానం నుంచి సుబ్బిరామిరెడ్డి ని పోటీ చేయించాలని జగన్ అనుకున్నారట. కిందటి ఎన్నికల్లో తన తల్లి ఓడిపోయిన ఆ స్థానాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలని జగన్ కసిగా వున్నారు. అందుకు టీఎస్సార్ సరైన అభ్యర్థి అవుతారని జగన్ అనుకుని ఆయనకి దఫదఫాలుగా తన రాయబారులతో కబురు పంపారట. పార్టీలో చేరితే విశాఖ సీట్ తో పాటు తగిన ప్రాధాన్యం ఇస్తామని కబురు చేసినా ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదంట తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి. కనీసం ఏమి కోరుతున్నారో తెలిస్తే కదా… ఇలా బదులు చెప్పకపోతే ఎలా అని జగన్ మాధానపడుతున్నారంట. అయితే ఢిల్లీ రాజకీయాల్ని దగ్గరగా చూసిన సుబ్బిరామిరెడ్డికి జగన్ కంటికి ఆనలేదేమో. ఇలాంటి విషయాలు చెప్పకుండా తప్పించుకు తిరుగువాడు ధన్యుడు అన్నట్టు తిక్కవరపు వ్యవహరిస్తుంటే ఇంకా జగన్ అర్ధం చేసుకోకపోతే ఎలా?.

మరిన్ని వార్తలు:

అప్పుల భయం, నాన్న సానుభూతి కోసం ?

మోడీ మిషన్లో నెక్స్టేంటి..?

కొడుకు పెళ్లి డేట్ అనౌన్స్ చేసిన సునీతమ్మ.