Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కాపు రిజర్వేషన్ వ్యవహారం పెండింగ్ లో వున్నప్పుడు, తుని విధ్వంసం తరువాత కేసులు నమోదు అయినప్పుడు తెలుగు ప్రజలకు ఓ దృశ్యం కామన్ గా కనిపించేది. దర్శకరత్న దాసరి ఇంటిలో ముద్రగడతో పాటు మెగా స్టార్ చిరంజీవి మొదలుకుని కాంగ్రెస్ నేత పల్లంరాజు, వైసీపీ నేతలు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు భేటీ కావడం సీఎం చంద్రబాబుకు డెడ్ లైన్స్ పెట్టడం చాలా సార్లు చూసాం. ఆ సందర్భంలోనే కొందరు నేతలు చంద్రబాబు మీద కాస్త దూకుడుగానే మాట్లాడారు. ఇక ముద్రగడ అయితే ఎన్నెన్ని మాటలు అన్నారో అందరూ చూసారు. అనవలసిన మాటలు మొత్తం అన్నాక కాపు రిజర్వేషన్ కల్పిస్తే ఆయనకు పాదాభివందనం చేస్తామని అన్న సందర్భాలు కూడా లేకపోలేదు.
కాపు రిజర్వేషన్ బిల్లుని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదించాక అప్పుడు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన వాళ్ళు పాదాభివందనాలు, పాలాభిషేకాలు మాటేమో గానీ కనీసం మనస్ఫూర్తిగా సీఎం చంద్రబాబుని కలిసి థాంక్స్ చెప్పినట్టు కూడా పెద్దగా కనిపించడం లేదు. టీడీపీ లోని కాపు నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ విషయంలో కాస్త హడావిడి చేస్తున్నప్పటికీ నాడు కాపు ఉద్యమంలో చురుగ్గా వ్యవహరించినవాళ్లు ఇప్పుడు తమ డిమాండ్ నెరవేరాక కనీసం చంద్రబాబుకి కృతజ్ఞతలు చెబితే బాగుండేది. అదే సందర్భంలో షెడ్యూల్ 9 లో ఈ అంశాన్ని చేర్చే అవకాశం గురించి కూడా ప్రస్తావించే ఛాన్స్ దొరికేది. అలా చేయకుండా ఇంకా చంద్రబాబు మీద సందేహాలు మాత్రమే వ్యక్తం చేస్తుంటే ఉద్యమంలో చురుగ్గా వ్యవహరించిన కొందరి వెనుక వైసీపీ హ్యాండ్ ఉందన్న అనుమానాలకు బలం చేకూరుతోంది.