భారతమహిళా స్టార్‌స్ప్రింటర్ ద్యుతీ చంద్ 100మీటర్ల విభాగంలో విజేతగా నిలిచి జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో స్వర్ణపతకాన్నిపొందింది.100మీటర్ల పరుగును 11.25సెకన్లలో ముగించి కొత్త జాతీయ రికార్డు సాదించింది.
ఒడిశా కి చెందిన ఈ అథ్లెట్ కొత్త రికార్డుతో అగ్ర స్థానంలో ఉంది.అంతకుముందు పాల్గొన్న సెమీఫైనల్ లో 11.22 సెకన్లలో 100 మీటర్ల పరుగు తీసింది. 2016 రియో ఒలింపిక్స్ లో 100 మీటర్ల పరుగు పందెంలో పాల్గొనడానికి అర్హత సాదించిన ఈక్రీడాకారిణి ప్రస్తుతం నాగపురి రమేశ్ కోచ్ వద్ద శిక్షణ తీసుకుంటుంది.