వీడు గ్రేట్ బాసూ…ప్రేమ నిరూపించుకోవడం కోసం కాల్చేసుకున్నాడు !

Atul Lokhande Allegedly Shoots Himself At Girlfriend’s Home,

ఈ రోజుల్లో ప్రేమపేరుతో అమ్మాయిలను మోసం చేసే​ అబ్బాయిలు, అబ్బాయిలను మోసం చేసే అమ్మాయిలు ఎక్కువగా ఉన్నారు. కానీ ఈ జెనరేషన్లోను నిజాయితీగా ప్రేమించేవారు ఉన్నారని నిరూపించాడు ఓ యువకుడు. తన స్వచ్ఛమైన ప్రేమను నిరూపించుకోవడానికి ప్రాణాలే త్యాగం చేశాడు. ‘నీ ప్రేమ నిజమైనదైతే కాల్చుకుని నీ ప్రేమను నిరూపించుకో’ అని తన ప్రియురాలి తండ్రి తనతో అనగా ఓ యువకుడు నిజంగానే తుపాకీతో కాల్చుకుని మృతి చెందిన ఘటన మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లోని అరోరా మండలంలో చోటు చేసుకుంది. అందుతున్న సమాచరం ప్రకారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భోపాల్‌లోని అరోరా మండలానికి చెందిన అతుల్‌ లఖండే భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) మండల ఉపాధ్యాక్షుడిగా పనిచేస్తున్నాడు. కాగా గత కొంత కాలంగా అదే మండలానికి చెందిన బ్యాంక్‌ ఉద్యోగినితో ప్రేమలో ఉన్నాడు. వీరి పెళ్లికి అమ్మాయి తండ్రి నిరాకరించాడు. దీంతో అతుల్‌కి, ఆమె తండ్రికి మధ్య గొడవలు అయ్యాయి. ఒకానొక దశలో అతుల్‌ బెదిరింపులకు కూడా దిగాడు. దీంతో అమ్మాయిని తీసుకొని ఎంపీనగర్‌కు షిప్ట్‌ అయ్యారు అమ్మాయి తల్లిదండ్రులు.

కొంతకాలం బానే ఉన్నా కొద్ది రోజుల తర్వాత అతుల్‌ మళ్లీ ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. అక్కడే ఉన్న ఆమె తండ్రి నీది ప్రేమ కాదని, అది మోజు అని ఆరోపించారు.‘ నీ ప్రేమ నిజమైతే నిన్ను నీవు కాల్చుకొని నిరూపించుకో. అప్పుడు బతికి ఉంటే నా కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తా. మృతి చెందితే వచ్చే జన్మలో తన కూతురిని పెళ్లి చేసుకోమని ఉచిత సలహా ఇచ్చి సవాల్‌ చేశాడు. దీంతో మంగళవారం రాత్రి 9.30గంటలకు ప్రియురాలి ఇంటికి వెళ్లిన అతుల్‌ అందరూ చూస్తుండగానే తుపాకితో తలను కాల్చుకున్నాడు. అక్కడే ఉన్న అతుల్‌ బంధువు, బ్యాంక్ ఉద్యోగిని కలిసి ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు డాకర్లు తెలిపారు.

అయితే చనిపోవడానికి ఒక రోజు ముందు అతుల్‌ ఫేస్‌బుక్‌లో ఈ విషయాన్నీ తన స్నేహితులతో పంచుకున్నాడు. ‘ నా ప్రేయసి తండ్రి నా ప్రేమను నిరూపించుకునేందుకు ఒక టాస్క్‌ ఇచ్చాడు. నన్ను నేను కాల్చుకొని నా ప్రేమను నిరూపించుకుంటాను. ఆమె లేని జీవితం నాకు వద్దు. ఇది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం. దయచేసి ఆమెను ఎవరూ నిందించకండి. మళ్లి జన్మంటూ ఉంటే తనను పెళ్లి చేసుకోవాలని ఉంది’ అంటూ ప్రియురాలితో కలిసి దిగిన 40 ఫోటోలను పోస్ట్‌ చేశాడు.