Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఈమద్య కాలంలో టాలీవుడ్‌లో ఒక చెడ్డ అలవాటు కొనసాగుతుంది. సినిమా ఫ్లాప్ అయినా, సరిగా ఆడకున్నా కూడా సక్సెస్ మీట్‌లు జరుపుతున్నారు. థ్యాంక్స్ మీట్‌లు, సక్సెస్ మీట్‌ల వల్ల సినిమాకు పబ్లిసిటీ దక్కుతుందని, అలా పబ్లిసిటీ దక్కితే సినిమాకు కలెక్షన్స్ పెరుగుతాయని చిత్ర యూనిట్ సభ్యుల అభిప్రాయం. సినిమాలు ఫ్లాప్ అయినా కూడా సక్సెస్ మీట్ అంటూ జరుపుతున్నారు అంటూ ఇటీవలే సురేష్‌బాబు అభిప్రాయం వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. ఆ విషయాన్ని మరవక ముందే మోహన్‌బాబు వంటి పెద్ద హీరో సినిమా ఫ్లాప్ అయినా కూడా సక్సెస్ మీట్‌ను జరిపి విమర్శల పాలు అయ్యాడు.
ఇతర చిన్న హీరోలకు మార్గదర్శకంగా నిలవాల్సిన మోహన్‌బాబు తన ‘గాయత్రి’ సినిమా ఫ్లాప్ అయినా కూడా సక్సెస్ మీట్ పేరుతో మీడియాను మరియు ప్రేక్షకులను మోసం చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదని, మోహన్‌బాబు ఇండస్ట్రీలో పెద్ద దిక్కుగా మెలగాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఆయన ఇలాంటి పని చేస్తే ఇతయి కూడా దాన్నే ఫాలో అవుతారు అంటూ కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఫ్లాప్ సినిమాలకు సక్సెస్ మీట్‌లు చేయడం వల్ల ఏ సినిమా సక్సెస్, ఏ సినిమా ఫ్లాప్ అయ్యిందో తెలుసుకునే అవకాశం లేకుండా పోతుందని, అందుకే ఫ్లాప్ సినిమాలకు సక్సెస్ మీట్‌లు చేయవద్దని పెద్దలు చెబుతున్నారు. మళ్లీ అదే పెద్దలు ఇలా తమ సినిమాలకు సక్సెస్ మీట్‌లు జరుపుకోవడం విడ్డూరంగా ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ మద్య విడుదలై ఫ్లాప్ అయిన పలు చిత్రాలకు సక్సెస్ మీట్‌లు జరిపారు. అందులో భాగంగానే మోహన్‌బాబు ‘గాయత్రి’ చిత్రానికి కూడా సక్సెస్ మీట్‌ను నిర్వహించారు.