Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎన్టీఆర్, పూరి జగన్నాధ్‌ల కాంబినేషన్లో వచ్చిన ‘టెంపర్’ చిత్రం సూపర్ హిట్ అయిన విషయం తెల్సిందే. తెలుగులో సంచలన విజయాన్ని సాధించిన టెంపర్‌ను తమిళం మరియు హిందీల్లో రీమేక్ చేస్తున్నారు. తెలుగులో క్లైమాక్స్‌కు సూపర్ టాక్ దక్కింది. ముఖ్యంగా కోర్టు సన్నివేశం సినిమాకు హైలైట్‌గా నిలిచింది. ఆ సీన్లో ఎన్టీఆర్ నటన కెరీర్ బెస్ట్ అనిపించుకుంది. అంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న టెంపర్ క్లైమాక్స్ తమిళంలో కనిపించదని సమాచారం అందుతుంది.
తమిళంలో విశాల్ హీరోగా టెంపర్ రీమేక్ చేయబోతున్నారు. ఇటీవలే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. భారీ అంచనాల నడుమ టెంపర్‌ను అక్కడ విశాల్ నెత్తికి ఎత్తుకుంటున్నాడు. టెంపర్ రీమేక్ విషయంలో కొన్ని రోజులుగా సీరియస్ చర్చ జరిగింది. మొదట ఉన్నది ఉన్నట్లుగా చూపించాలని భావించారు. అయితే తాజాగా తమిళ ఆడియన్స్‌కు తెలుగు క్లైమాక్స్ వర్కౌట్ అవ్వదని, తమిళంలో మరో క్లైమాక్స్‌ను చూపించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. తెలుగు కంటే అద్బుతమైన క్లైమాక్స్‌ను తాము చూపించబోతున్నట్లుగా దర్శకుడు చెబుతున్నాడు. మరి తమిళంలో మారుస్తున్న ఆ క్లైమాక్స్ వల్ల సినిమా స్వరూపమే మారుతుందని, అలా అయితే సినిమాను చంపేసినట్లుగా అవుతుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.