Posted [relativedate] at-[relativetime time_format=”H:i”]
కేవలం రెండు కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పెళ్లి చూపులు’ చిత్రం దాదాపు 25 కోట్ల బిజినెస్‌ను చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ మరియు బాలీవుడ్‌లో కూడా పెళ్లి చూపులు చిత్రం సత్తా చాటింది. ఆన్‌లైన్ రైట్స్, శాటిలైట్ రైట్స్ ఇలా అన్ని విధాలుగా భారీ లాభాలను దక్కించుకుని నిర్మాతలకు కాసుల పంట పండివ్వడం జరిగింది. ఇప్పుడు అదే బ్యానర్‌లో వస్తున్న చిత్రం ‘మెంటల్ మదిలో’. పెళ్లి చూపులు చిత్రంపై నమ్మకంతో సురేష్‌బాబు సమర్పించేందుకు ముందుకు వచ్చాడు. అలాగే ఈ చిత్రాన్ని కూడా సురేష్‌బాబు సమర్పిస్తున్నాడు.
పెళ్లి చూపులు చిత్ర బ్యానర్ మరియు సురేష్‌బాబు సమర్పిస్తున్న కారణంగా సినీ వర్గాల్లో ‘మెంటల్ మదిలో’ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉంటుందని, పెళ్లి చూపులు సెంటిమెంట్‌ను మరోసారి కంటిన్యూ చేస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు చాలా నమ్మకంగా ఉన్నారు. రేపు తెలుగు సినిమా పరిశ్రమలో ఏకంగా 11 సినిమాలు విడుదల కాబోతున్నాయి. ప్రేక్షకుల దృష్టి ‘బాలకృష్ణుడు’ చిత్రంపై ఉంటే సినీ వర్గాలు మరియు మీడియా వర్గాల దృష్టి ‘మెంటల్ మదిలో’ చిత్రంపై ఉంది. పదకొండు చిత్రాల్లో ‘మెంటల్ మదిలో’ ఒకటై పోతుందా, ఒక్కటిగా నిలుస్తుందా అనేది చూడాలి.