Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
2018 సంవత్సరం వచ్చి నెల రోజులు దాటింది. గత సంవత్సరం జనవరి నెలలో మూడు సూపర్ హిట్ చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. కాని ఈ సంవత్సరం నెల రోజులు దాటినా కూడా ఒక్కటి కూడా ప్రేక్షకులను అలరించడంలో సఫలం కాలేక పోయాయి. సంక్రాంతి సీజన్‌లో వచ్చిన రెండు పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. ఇక రిపబ్లిక్ డే సందర్బంగా వచ్చిన అనుష్క ఏమాత్రం ప్రేక్షకులను అలరించలేక చతికిల్లపడిపోయింది. ఇక రెండవ నెల అయిన ఫిబ్రవరిలో రవితేజ ‘టచ్ చేసి చూడు’ చిత్రంతో సక్సెస్ ఖాతా తెరుచుకుంటుందని అంతా ఆశించారు. తాజాగా విడుదలైన టచ్ చేసి చూడు మూస మాస్ చిత్రాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంది.
ఫిబ్రవరిలో విడుదల కాబోతున్న మెగా చిత్రాలు ‘తొలిప్రేమ’ మరియు ‘ఇంటిలిజెంట్’ చిత్రాలపైనే అందరి దృష్టి కేంద్రీకృతం అయ్యి ఉంది. ఈ రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను అలరించకుంటే ఏప్రిల్ వరకు సక్సెస్ కోసం టాలీవుడ్ ఎదురు చూడాల్సి ఉంటుంది. ఫిబ్రవరిని టాలీవుడ్ వర్గాల వారు అన్ సీజన్ అంటారు. ఫిబ్రవరి మరియు మార్చిల్లో పరీక్షల సీజన్ ఉంటుంది. అందుకే సినిమాలకు పెద్దగా సక్సెస్‌లు వచ్చింది లేదు. సినిమాలు సూపర్ హిట్ అయితే తప్ప ఫిబ్రవరిలో కలెక్షన్స్ రావు అని సినీ వర్గాల వారు అభిప్రాయం. ‘తొలిప్రేమ’, ‘ఇంటిలిజెంట్’ చిత్రాల్లో కనీసం ఒక్కటైనా సక్సెస్ కాకుండా పోతుందా అని కొందరు అంచనాలు పెట్టుకున్నారు. ఒక వేళ రెండు ఫలితం తారుమారు అయితే ఎదురు చూపులు కంటిన్యూ అవుతాయి.