తెలంగాణలోని ఓ అక్రమ సంబంధం యువకుడి ప్రాణాలను బలికొంది. వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ప్రియుడు తనకు కాకుండా పోతాడన్న ఆక్రోశంతో ఓ వివాహిత అతడిని అతి కిరాతకంగా చంపేసింది. తన కంటే వయస్సులో ఇరవై ఏళ్లు చిన్నవాడైన యువకుడితో అక్రమ సంబంధం నడుపుతోంది. ఆ యువకుడు తాజాగా పెళ్లి చేసుకోబోతున్నాడని తెలిసి ఆ మహిళ ప్రియుడి ప్రాణం తీసింది. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలంలో వెలుగుచూసింది.
ప్రియుడు పెళ్లి చేసుకొని వెళ్లిపోతాడని భావించిన ఆంటీ తనకు దక్కుని వాడు ఎవరికీ దక్కకూడదన్న ఆలోచనలో ఏకంగా చంపేసింది. కత్తితో ప్రియుడిని గొంతు కోసి ప్రాణం తీసింది. అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామానికి చెందిన బాలమ్మ(42)ను భర్త కొన్నాళ్ల క్రితం వదిలేశాడు. దీంతో ఆమె అదే గ్రామంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని కుమార్తెతో కలిసి స్థానికంగా ఇళ్లలో పనిచేసుకుంటూ అక్కడే నివాసం ఉంటుంది.
అయిత ఒంటరిగా ఉంటున్న బాలమ్మ బుడగ జంగాల కాలనీకి చెందిన పర్రె ఆంజనేయులు అనే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త అడ్డు లేకపోవడంతో ప్రియుడిని రోజూ ఇంటికి రప్పించుకుని రాసలీలలు సాగించేది. ఇంతలో ఆంజనేయులుకు ఓ అమ్మాయితో పెద్దలు వివాహం నిశ్చయించారు. ఈ నెల 17న పెళ్లి. ఈ విషయం తెలుసుకున్న బాలమ్మ తనను వదిలేసి ఎలా పెళ్లి చేసుకుంటావని ప్రియుడిని నిలదీసింది. పెళ్లి చేసుకున్నాగానీ.. నీతో సంబంధం కొనసాగిస్తానని ఆంజనేయులు నచ్చ జెప్పే ప్రయత్నం చేసినా ఆమె వినిపించుకోలేదు. తాజాగా ఓ రోజు రాత్రి గడుపుదామని ఆంజనేయులుకు బాలమ్మ ఫోన్ చేసి రప్పించుకుంది. ఆ సమయంలో ఎంతచెప్పినా గానీ.
ఆంజనేయులు వినకపోవడంతో ఆగ్రహించిన ఆమె మాంసం కొట్టే కత్తితో ప్రియుడి గొంతును కోసేసింది. తీవ్ర రక్తస్రావంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తర్వాత చాలలో చుట్టి బ్యాంకు సమీపంలోని మురుగు కాలువలో పడేసింది. ఇక ఆంజనేయులు కనిపించక పోవడంతో కంగారుపడిన అతడి తల్లి నారమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు మన్ననూరు గ్రామంలో గాలించారు. అక్కడే బ్యాంకు సమీపంలో కుళ్లిపోయిన మృతదేహం కనిపించింది. అది ఆంజనేయులుదిగా నిర్ధారించిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులను విచారించగా అక్రమ సంబంధం గురించి చెప్పారు. దీంతో పోలీసులు బాలమ్మను అదుపులోకి తీసుకుని విచారించగా ఆంజనేయులును తానే హత్య చేసినట్లు ఒప్పుకుంది. కాగా ఆమెపై హత్య కేసును నమోదు చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు.