కేఫ్ కాఫీ డే (సీసీడీ) వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ మృతిపై మంగుళూరు పోలీసు కమిషనర్ పీఎస్ హర్ష స్పష్టమైన ప్రటకన చేశారు. వీజీ సిద్ధార్థది ఆత్మాహత్యే అని ఆయన కన్ఫర్మ్ చేశారు. దీనికి సంబంధించిన అటాప్సీ రిపోర్ట్ విశేషాలను ఆయన వెల్లడించారు.
అయితే తదుపరి విచారణలో ఆయన ఏ కారణం చేత ఆత్మహత్యకు పాల్పడ్డాడు అన్న అంశాన్ని తేల్చనున్నట్లు సీపీ హర్ష చెప్పారు. దర్యాప్తు చేస్తున్న అధికారులు ఇచ్చిన తుది నివేదిక ఆధారంగా కాఫీ డే ఓనర్ సిద్ధార్థ ఆత్మహత్యే చేసుకున్నట్లు తేలిందన్నారు.
దర్యాప్తులో భాగంగా కాఫీడే ఉద్యోగులు, బోర్డు డైరక్టర్లను పోలీసులు విచారించారు. ఈ కేసులో మరికొంత మందిని ప్రశ్నించనున్నారు, అన్ని కోణాల్లోనూ విచారణ ఉంటుందని సీపీ అన్నారు. గత జూలై 29వ తేదీన మంగుళూరు వద్ద ఉన్న నేత్రావతి నదిలో దూకి సిద్ధార్థ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.