Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Ayyanna patrudu and ganta srinivas rao has no talks
విశాఖ దేశంలో ఇద్దరు మంత్రులు మధ్య రాజుకున్న అగ్గి అంత తేలిగ్గా చల్లారేట్టు లేదు. అయ్యన్న,గంటా మధ్య గొడవల మీద ఓ వైపు టీడీపీ త్రిసభ్య కమిటీ ఏర్పాటైంది.ఇంకోవైపు ఎంతటి నేతలైనా పార్టీకి నష్టం చేస్తే ఊరుకునేది లేదని బాబు హుంకరింపులు. అయినా ఆ ఇద్దరు ఒక్క అడుగు కూడా వెనక్కి వేసినట్టు కనపడడం లేదు.అందుకు విశాఖ లో జరిగిన ఓ సభ ప్రత్యక్ష ఉదాహరణ.
విశాఖ లో పేరుపడ్డ ఓ స్థానిక పత్రిక జర్నలిస్టులకి ప్రతిభాపురస్కారాలు ఇచ్చేందుకు ఓ ఫంక్షన్ ఏర్పాటు చేసింది. దానికి మంత్రులు గంటా,అయ్యన్న లని పిలిచింది. ఆ ఇద్దరూ సభకి వచ్చారు. నిర్వాహకులు కూడా ఆ ఇద్దరికీ పక్కపక్కనే కుర్చీలు వేశారు.ఆ ఇద్దరూ పక్కపక్క కూర్చున్నారు గానీ ఒకరితోఒకరు మాట్లాడుకోలేదు.కనీసం ఒకరిని ఒకరు చూసుకోలేదు.సభ ప్రారంభం అయ్యాక ఇద్దరినీ వేదిక మీదకి పిలిచారు.అక్కడా అదే తీరు.ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు.
విశాఖలో భూకుంభకోణాలకు సంబంధించి ఎక్కడి నుంచో వచ్చిన నేతలు ఇక్కడ తప్పులు చేస్తున్నారని అయ్యన్న వ్యాఖ్యానించడం,ఆయనపై సీఎం కి గంటా లేఖ రాయడంతో ఇద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది.ఈ సభలో వుంది మొత్తం విలేకరులు కాబట్టి కనీసం ఊహాగానాలకు తెర దించేందుకు అయినా మంత్రులు ఇద్దరూ మాట్లాడుకుంటారని అంతా భావించారు.మాటలు కాదు కదా కనీసం చూపులు కూడా లేవు.పైగా మంత్రి అయ్యన్న మైక్ తీసుకుని మరీ మీరేదో మా ఇద్దరినీ కలపడానికి ప్రయత్నిస్తున్నట్టు చేస్తున్నారు.అంత అవసరం లేదన్నట్టు చెప్పారు.కానీ ఆ మాటలకి తగ్గట్టు మంత్రులు ప్రవర్తించలేదని చిన్నపిల్లవాడిని అడిగినా చెబుతారు.