కాల్ మీ సెక్సీ బాయ్స్…పగ బట్టిన బీటెక్ విద్యార్ధి…!

B.tech Student Revenge Call Your Sexy Boys Professor Website

ఈగో ఎంతటి అనర్ధాలకు దారి తీసుతుందో తెలిపే ఘటన ఇది. అందరి ముందు తనను అవహేళన చేస్తూ మాట్లదిందన్న కారణంగా మహిళా ప్రొఫెసర్‌పై పగ పెంచుకున్న ఓ బీటెక్ స్టూడెంట్ ఆమె వివరాలను అశ్లీల వెబ్‌సైట్‌లో ఉంచాడు. ఫేస్‌బుక్‌లో ఉంచిన ఆమె ప్రొఫైల్‌ చిత్రాన్ని డౌన్‌లోడ్‌ చేసి దానితోపాటు ఫోన్‌ నెంబర్‌ను అనే అశ్లీల వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేశాడు. అంతటితో ఆగకుండా అసభ్య మెసేజ్‌లను పోస్ట్‌ చేశాడు. నాతో సెక్స్‌ చాట్‌ చేయాలనుకునే వారు రూ. 1,200, నగ్న చిత్రాలు కావాలంటే ఒక్కో చిత్రానికి రూ. 200, శృంగారంలో పాల్గొనాలంటే రూ. 5,000 చెల్లించాలని చెప్పలేని విధంగా అసభ్యకర మెసేజ్‌లను అప్‌లోడ్‌ చేశాడు. సెక్స్‌కు సంబంధించిన విషయాలు మాట్లాడాలంటే ‘కాల్‌ మీ సెక్సీ బాయ్స్‌’ అంటూ మెసేజ్‌ పెట్టాడు.

facebook

దీంతో రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఫోన్ కాల్స్ వస్తుండటంతో ఎంతో మానసిక క్షోభకు అనుభవించిన బాధితురాలు చివరికి రాచకొండ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. వారు దర్యాప్తు చేసి ఈ దారుణానికి పాల్పడింది మీ కాలేజీలో చదివే విద్యార్థేనని పోలీసులు ఆమెకు తెలపడంతో ఆమె షాకయ్యారు. పక్కా ఆధారాలతో అతడిని పట్టుకొని విచారించగా.. ఇదంతా చేసింది తానేనని అంగీకరించాడు. దీంతో పోలీసులు నిందితుడిని కటకటాల వెనక్కి నెట్టారు. పోలీసుల సమాచారం ప్రకారం, హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న భాను ప్రకాష్ అనే వ్యక్తి వేరే బ్రాంచికి చెందిన అతడి ఫ్రెండ్ ఆస్తమా కారణంగా ఊపిరి ఆడక క్లాస్ రూంలో పడిపోయాడు. దీంతో సదరు భాను ప్రకాష్ అతణ్ని చూసేందుకు అక్కడికి వెళ్లాడు. కింద పడిపోయిన విద్యార్థి ప్రథమ చికిత్సతో కాసేపటి తర్వాత కోలుకున్నాడు. దీంతో ఊపిరి పీల్చుకున్న అతడి ఫ్రెండ్స్ అక్కడే పిచ్చాపాటి కబుర్లు మొదలుపెట్టింది. పెద్దగా మాట్లాడుతూ తరగతిలో గొడవ చెలరేగిందన్న కోపంలో అక్కడికి వచ్చిన అసిస్టంట్ ప్రొఫెసర్ అతను కోలుకున్నాడు కదా మీరంతా ఇక్కడి నుంచి వెళ్లండని మందలించారు. ఆ సమయంలో కాస్త గట్టిగా మాట్లాడిన విద్యార్ధిని హేళన చేస్తూ ఆమె మాట్లాడడంతో విద్యార్ధి ఆమె మీద పగ పెంచుకున్నాడు. పగ పెంచుకుని ఇంత దారుణానికి ఒడికట్టాడు.

facebook1