Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
‘బాహుబలి’ చిత్రంలో మహేంద్ర బాహుబలి అలియాస్ శివుడుకు పెంపుడు తండ్రిగా నటించిన ఐమ్యాక్స్ వెంకట్‌ను పోలీసులు చీటింగ్ కేసులో అరెస్ట్ చేశారు. ఐమ్యాక్స్ థియేటర్ మేనేజర్ అయిన వెంకట ప్రసాద్ సినిమాలు సీరియల్స్‌లో నటిస్తూ ఉంటాడు. ఈయన గత కొన్ని సంవత్సరాలుగా ఒక యువతితో సహజీవనం సాగిస్తున్నాడు. ఆమెను పెళ్లి చేసుకుంటాను అంటూ చెబుతూ వచ్చిన వెంకట్ ఇప్పుడు ఆమెను వదిలేశాడు. మోసపోయాను అంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు వెంకట్‌ను అరెస్ట్ చేసి విచారణ ప్రారంభించారు.
వెంకట్‌కు అంతకు ముందే పెళ్లి అయ్యింది. భార్యకు విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకుంటాను అంటూ యువతిని మోసం చేసి దాదాపు పది సంవత్సరాల పాటు సహజీవనం సాగించాడు. అదిగో ఇదిగో అంటూ పెళ్లిని వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వచ్చాడు. భార్యకు విడాకులు ఇవ్వకుండా తనను పెళ్లి చేసుకోకుండా మోసం చేస్తున్నాడు అంటూ ఆమె మీడియా ముందు వాపోయింది. తనను నమ్మించి మోసం చేసిన వెంకట్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తోంది. వెంకట్ సినిమాల్లో ఆఫర్లు ఇప్పిస్తాను అంటూ ఇంకా పలువురు అమ్మాయిలను కూడా మోసం చేశాడు అంటూ ఆమె ఆరోపించింది. కేసు విచారిస్తున్న పోలీసులు అతి త్వరలోనే పూర్తి వివరాలను వెళ్లడిస్తామని చెప్పుకొచ్చారు.