Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
‘బాహుబలి’ సినిమా కోసం నాలుగు సంవత్సరాలు కష్టపడ్డ ప్రభాస్ ఆ సినిమాతో ఒక్కసారిగా బాలీవుడ్ రేంజ్‌కు వెళ్లి పోయాడు. ‘బాహుబలి’ సినిమా రెండు పార్ట్లు కూడా సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ప్రభాస్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. అందుకే ప్రభాస్‌కు భారీగా పారితోషికం దక్కింది. ప్రస్తుతం చేస్తున్న సినిమాతో పాటు త్వరలో చేయబోతున్న సినిమాల రూపంలో కూడా భారీగా ఆదాయాన్ని ప్రభాస్ దక్కించుకోబోతున్నాడు. అందుకే నెల్లూరు జిల్లా సుల్లూరుపేటలో ఏకంగా 40 కోట్లు పెట్టి ఒక భారీ మల్టీప్లెక్స్ థియేటర్‌ను నిర్మించేందుకు ఏర్పాట్లు చేశాడు.
దేశంలోనే అత్యాధునిక టెక్నాలజీని ఈ థియేటర్లో వాడబోతున్నట్లుగా ప్రభాస్ సన్నిహితులు చెబుతున్నారు. మూడు స్క్రీన్లతో ఈ మల్టీప్లెక్స్ నిర్మాణం జరుగబోతుంది. 106 అడుగులతో అతి పెద్ద స్క్రీన్‌ను ఏర్పాటు చేయబోతున్నారు. 670 సీట్ల కెపాసిటీ కలిగి ఉంటుందని చెబుతున్నారు. ఇంత పెద్ద భారీ థియేటర్, అంత పెద్ద స్క్రీన్‌తో పాటు త్రీడీ టెక్నాలజీతో సదరు థియేటర్‌ను రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక మిగిలిన రెండు స్క్రీన్లు రెగ్యులర్ సైజ్‌లో కనిపించనున్నాయి. మిగిలిన రెండు స్క్రీన్లలో 170 చొప్పున సీట్లను ఏర్పాటు చేయబోతున్నారు. దాదాపు 10 ఎకరాల్లో ఈ సినిమా హాల్ నిర్మాణం జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. షాపింగ్ మాల్స్, పిల్లలు ఆడుకునే ప్లే గ్రౌండ్ ఇంకా పలు విభాగాలకు సంబంధించిన స్టోర్లు ఈ మల్టీప్లెక్స్‌లో ఉండబోతున్నట్లుగా చెబుతున్నారు. ఈ థియేటర్ పేరును ‘బాహుబలి’గా ఖరారు చేశారు. ఈ థియేటర్ పూర్తి నిర్మాణ వ్యయంను ప్రభాస్ భరిస్తున్నాడా లేక భాగస్వామ్యులు ఉన్నారా అనే విషయం తెలియాల్సి ఉంది.
మరిన్ని వార్తలు: