రాష్ట్రంలో ఎవరి నోట విన్నా, ఏ టీవీ ఛానల్ లో చూసినా, ఏ పేపర్ చదివినా, చంద్రబాబు అరెస్టు గురించి తప్ప మరో విషయం లేదు. ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు అరెస్టుకు గల కారణాలు, అరెస్టు సక్రమంగా జరిగిందా, అక్రమంగా జరిగిందా, స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు నాయుడు పాత్ర ఉందా, లేదా అని చర్చించుకుంటున్నారు. చంద్రబాబునాయుడుని వదిలిపెడతారా ?ఇంకా జైల్లోనే ఉంచుతారా? చంద్రబాబునాయుడు అరెస్టు అధికార పార్టీ కుట్రని కొందరు అంటుంటే కాదు నిజంగానే స్కాం జరిగిందని కొందరు అంటున్నారు. ఇలా రకరకాల వాదనలతో అందరూ అరెస్టు గురించే మాట్లాడుకుంటున్నారు.
అధికార పార్టీకి కావాల్సింది ప్రజా సమస్యల పక్కదారి పెట్టడమే అందుకోసమే అరెస్ట్ చేశారా అనేలా ఉన్నాయి ఇప్పటి పరిస్థితులు. ప్రజలకు అవసరమైన రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ సమస్య, నిత్యావసర ధరలు పెరగడం మొదలైన వాటి గురించి ఎవరు మాట్లాడుకోవడం లేదు. ఏ టీవీ ఛానల్ వాళ్ళు, ఏ న్యూస్ పేపర్ వాళ్ళు చూపించటం లేదు. పరిశీలించి చూడగా చంద్రబాబునాయుడు అరెస్టుతో అధికార పార్టీ తమ ప్రభుత్వంలో ఉన్న లోపాలను పక్కదారి పట్టించడానికే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఈ పరిస్థితులలో ప్రజా సమస్యలపై పోరాడేవారు కావాలి. ఇదే సమయంలో టిడిపి-జనసేన కలిసి పోటీ చేస్తాయని పవన్ ప్రకటించారు. రెండు పార్టీలు ఇంకా కలిసి పోరాటం చేస్తాయని చెప్పారు. దీంతో ఆ రెండు పార్టీలు ఇంకా కలిసి పోరాటం చేయడానికి రెడీ అవుతున్నాయని చెప్పవచ్చు. బాబు అరెస్ట్ పై న్యాయ పోరాటం చేస్తూనే..రాష్ట్ర ప్రజల సమస్యలపై పవన్- లోకేష్ పోరాటం చేసే అవకాశాలు ఉన్నాయి. మరి రానున్న రోజుల్లో టిడిపి-జనసేన పోరాటం ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.