Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పద్మావత్ పై బీజేపీ పాలిత రాష్ట్రాలు నిప్పులు కక్కుతున్నాయి. సినిమాపై నిషేధం విధించాయి. ఇలాంటి తరుణంలో ప్రధాని మోడీ ముందు పద్మావత్ లోని ఘూమర్ పాటకు ఓ బాలిక డ్యాన్స్ చేయడం హాట్ టాపిక్ అయింది. మోడీ సొంతరాష్ట్రం గుజరాత్ లో ప్రధాని, ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు సమక్షంలో ఓ బాలిక ఘూమర్ పాటకు నృత్యం చేసింది. భారత్ లో పర్యటిస్తున్న నెతన్యాహు బుధవారం ఓ రోడ్ షోలో పాల్గొన్నారు. ఆయన రాక సందర్భంగా ఓ సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలోనే ఓ బాలిక ఘూమర్ డ్యాన్స్ చేసింది. పద్మావతి సినిమాను నిషేధించిన రాష్ట్రాల్లో గుజరాత్ కూడా ఒకటి. నిషేధిత రాష్ట్రంలో ప్రధాని ముందు బాలిక చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇటీవల మధ్యప్రదేశ్ లోని ఓ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఘూమర్ పాటకు డ్యాన్స్ చేశారని కొందరు వ్యక్తులు విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై దాడిచేశారు. రాజ్ పుత్ ల గౌరవాన్ని కించపరిచేలా ఉందని రాజ్ పుత్ కర్ణిసేన ఆందోళన చేస్తుండడంతో… శాంతిభద్రత లను కారణంగా చూపుతూ పద్మావత్ పై గుజరాత్ తో పాటు మధ్యప్రదేశ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వాలు నిషేధం విధించగా… సుప్రీంకోర్టులో చుక్కెదురయింది. శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని, ఆ కారణంతో సినిమా విడుదల అడ్డుకోవడం సబబు కాదని వ్యాఖ్యానించిన అత్యున్నత న్యాయస్థానం నిషేధాన్ని ఎత్తివేసింది.
#Ghoomar song of @filmpadmaavat played and dance performed on it in #Ahmedabad. This program is to welcome PM @narendramodi & Isreal PM #Netanyahu. 👏👏👏 pic.twitter.com/layjWd0t5R
— Kirandeep (@raydeep) January 17, 2018