పురంధేశ్వరికి కలిసి రాని కాలం

bad-time-continuing-for-puramdeswari-in-ap-bjp-party

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

రాజకీయ అరంగేట్రమే తేడాగా జరిగింది. తండ్రి వ్యతిరేకించిన పార్టీకి వెళ్లడమేంటని కుటుంబమే కాదు అభిమానులూ తప్పుబట్టారు. అయినా తన టాలెంట్ తో అందరి మెప్పు పొందారు పురంధేశ్వరి. కానీ బీజేపీలోకి వచ్చాక సీన్ రివర్స్ అయింది. ఇక్కడ చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా ఉండటం ఆమెకు ఇబ్బందిగా మారింది. చంద్రబాబుతో కోరి తగాదా ఎందుకని అమిత్ షా ఆలోచిస్తున్నారు.

దీనికి తోడు పురంధేశ్వరి దూకుడుతో పార్టీకి ముప్పని సీనియర్ వెంకయ్య కూడా సలహా ఇవ్వడం ఆమెకు పార్టీ అధ్యక్ష పదవిని దూరం చేసింది. దీంతో ఏపీలో హరిబాబు తర్వాత పార్టీ అధ్యక్షుడెవరనే ప్రశ్నకు ఇంకా ఆన్సర్ దొరకలేదు. హరిబాబు కేంద్రమంత్రి కావడం ఖాయంకాగా.. ఇప్పుడు అర్జెంట్ గా పార్టీ అధ్యక్షుడ్ని ఖరారు చేయాల్సిన బాధ్యత అమిత్ షా పై ఉంది.

ఇప్పటికే మిత్రుడు చంద్రబాబును కూడా అభిప్రాయం అడిగిన అమిత్ షా.. ఆయన ఆలోచనలు ప్రకారం వెళ్లాలనే భావన కూడా వ్యక్తం చేస్తున్నారట. ఏపీలో బీజేపీలో సింగిల్ గా మనలేదు. వైసీపీతో జట్టు కడితే పతనం తప్పదు. అందుకే మిత్రుడు చంద్రబాబుతో పేచీల్లేకుండా ఉంటేనే.. పది కాలాల పాటు పార్టీకి సీట్లొస్తాయని అమిత్ షా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు:

జియో ఫోన్ తుఫాన్

కేసీఆర్ చీరలు… కొత్త రికార్డు