Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఇండియాస్ బిగ్గెస్ట్ చిత్రంగా నిలిచిన ‘బాహుబలి 2’ను చైనాలో విడుదల చేయబోతున్నట్లుగా గత కొంత కాలంగా ప్రచారం జరుగుతుంది. మొదటి పార్ట్ చైనాలో పెద్దగా సక్సెస్ కాలేదు. దాంతో రెండవ పార్ట్‌ను చైనాలో విడుదల చేయాలనే ఆసక్తిని మొదట చిత్ర యూనిట్ సభ్యులు వ్యక్తం చేయలేదు. అయితే దంగల్ మరియు కొన్ని హిందీ చిత్రాలు చైనాలో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో బాహుబలి 2ను కూడా విడుదల చేయాలని ఆర్కా మీడియా నిర్ణయించుకుంది. మొదటి పార్ట్ అంత భారీగా కాకున్నా ఈ చిత్రాన్ని కాస్త అటు ఇటుగా విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు.
తాజాగా చైనాలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రంను మరి కొన్ని రోజుల్లో అక్కడ ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్లాలనే నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను చైనాలో ఎలా చేయాలనే విషయంపై చిత్ర యూనిట్ సభ్యులు సంప్రదింపులు జరుపుతున్నారు. చైనాలో ఈ చిత్రం విడుదలైతే మరో 500 కోట్లు ఈ చిత్రం ఖాతాలో పడే అవకాశం ఉందని సమాచారం అందుతుంది. అదే కనుక జరిగితే సినిమా మరోసారి ఇండియాస్ నెం.1 చిత్రంగా నిలిచే అవకాశం ఉంది. టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయగా రానా విలన్‌గా నటించాడు, అనుష్క మరియు రమ్యకృష్ణలు ప్రధాన పాత్రల్లో నటించిన విషయం తెల్సిందే.